క్రీడాభూమి

ఏదైనా ఆ తర్వాతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: వచ్చే మూడేళ్లలో జట్టుకు నా సహకారం ఎంతో అవసరమని, మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడతానని, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శుక్రవారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు జరగనున్న సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైన ఫార్మాట్ నుంచి తప్పుకుంటారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు కోహ్లీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. మరో మూడేళ్లు అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. గత ఎనిమిదేళ్లుగా ఏడాదికి 300 రోజులు క్రికెట్ ఆడుతూనే ఉన్నానని, ఇది నాలాంటి ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. అయతే అన్ని ఫార్మాట్లలో ఆడే క్రికెటర్లమంతా వ్యక్తిగతంగా విశ్రాంతి తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. గురించి మాట్లాడుతూ కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని, దీని ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తుందన్నాడు. అయతే మధ్య మధ్యలో విరామాలు తీసుకుంటూ వీటన్నింటినీ అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో టెస్టు చాంపియన్‌షిపే అత్యున్నతమైనదని కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాము కూడా లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

*చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ