క్రీడాభూమి

సమఉజ్జీల సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 20: సమవుజ్జీల సమరంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టును పేర్కోవచ్చు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఎవరూ ఊహించలేకపోతున్నది. కాగితంపై చూస్తే, టెస్టు ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలంగా కనిపిస్తున్నది. అయితే, మైదానంలో కేన్ విలియమ్‌సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ రెచ్చిపోతున్నదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇరు జట్లలోనూ సమర్థులైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే బౌలర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లు దాదాపు సమ బలంతో కనిపిస్తున్నాయి. అయితే, హోం అడ్వాంటేజ్ కివీస్‌కు లాభిస్తుందనడంలో సందేహం లేదు. కివీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో 0-3 తేడాతో వైట్ వాష్ వేయించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇరు జట్లు చెరొక సిరీస్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నాయి. టెస్టు చాంపియన్‌షిప్ కోసం జరిగే చివరి సిరీస్‌లో ఆధిపత్య పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. స్థూలంగా చూస్తే మాత్రం భారత్‌నే ఫేవరిట్‌గా చెప్పుకోవచ్చు. నిలకడగా ఆడితే, టీమిండియాను ఓడించడం సులభం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే, భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోకుండా, బౌలర్లు రాణించకుండా కివీస్ క్రికెటర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, రెండు జట్లూ నువ్వా? నేనా? అన్న చందంగా పోరాటాన్ని సాగించనున్నాయి. ‘ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెల్చుకోవచ్చు. 0-2 తేడాతో కోల్పోవచ్చు. 1-1గా డ్రా చేసుకోవచ్చు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఫలితం తేలకపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఎలాంటి ఫలితమైనా రావచ్చు’ అంటూ ఓ విశే్లషకుడు చమత్కరించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

*చిత్రం...మొదటి టెస్టుకు ముందు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ స్మిత్‌తో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు