క్రీడాభూమి
దివ్య సంచలనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ సంచలన రెజ్లర్ దివ్య కక్రాన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో టైటిల్ సాధించిన రెండో భారతీయురాలిగా గుర్తింపు సంపాదించింది. కాగా, మరో ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు, పింకీ, సరితా మోర్ స్వర్ణ పతకాలను గెల్చుకోగా, నిర్మలా దేవి రజత పతకంతో సంతృప్తి చెందింది. 2018లో కిర్గిస్తాన్‌లోని బిష్కెక్లో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల 65 కిలోల విభాగంలో నవ్‌జోత్ కౌర్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోగా, తాజాగా దివ్య 68 కిలోల ఈవెంట్లో విజేతగా నిలిచింది. పైనల్లో ఆమె జూనియర్ ప్రపంచ చాంపియన్ నరుహా మసుయుకీని ఓడించింది. నిజానికి ఈ బౌట్లో మసుయుకీ గెలుస్తుందని క్రీడాపండితులంతా జోస్యం చెప్పారు. కానీ, దివ్య అందరి అంచనాలను తల్లకిందులు చేసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థిని చిత్తుచేసింది. మహిళల 59 కిలోల విభాగంలో సరితా మోర్ తన ప్రత్యర్థి, మంగోలియాకు చెందిన రెజ్లర్ అల్టన్సెగిన్ బట్సెసెగ్పై సులభంగా నెగ్గి, స్వర్ణ పతకాన్ని స్వీకరించింది. 55 కిలోల విభాగంలో పింకీ కూడా మంగోలియాకే చెందిన బాలోర్మాగిన్ డొల్గూన్పై విజయం సాధించింది. ఒకే రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి. కాగా, 50 కిలోల విభాగంలో నిర్మలా దేవి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, స్వర్ణాన్ని అందుకోలేకపోయింది. జపాన్ రెజ్లర్ మిహో ఇగవాషి చేతిలో పరాజయాన్ని చవిచూసిన ఆమె రజత పతకంతో సరిపుచ్చుకుంది.
స్వర్ణ పతకాన్ని భారత్‌కు అందించిన దివ్య ఈ టోర్నమెంట్లో మొదటి రౌండ్ నుంచే అసాధారణ ప్రతిభాపాటవాలు కనబరచింది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమె ఫైనల్ చేరే క్రమంలో అల్బినా కైర్గెలినొవా (కజకస్తాన్), డెల్గేర్మా కన్షైఖన్ (మంగోలియా), అజోడా ఎస్మెర్గెనొవా (ఉబ్జెకిస్తాన్)ను ఓడించింది. ఫైనల్లో జపాన్ రెజ్లర్ మసుయుకీపై విరుచుకుపడింది. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా జాగ్రత్త పడుతూ ఆమెను చిత్తు చేసి, టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో చైనా, జపాన్ రెజ్లర్లు పాల్గొనకపోవడం భారత్‌కు కలిసొచ్చింది.
*చిత్రాలు.. భారత యువ సంచలన రెజ్లర్ దివ్య కక్రాన్
*ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన పింకీ, సరిత