క్రీడాభూమి

ఇశాంత్‌కు మూడు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 22: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే ఆలౌటైన భారత జట్టు ఎదురుదాడికి దిగింది. ఇశాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ను కట్టడి చేశాడు. అయితే, కేన్ విలియమ్‌సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్‌ను ఆదుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌పై కివీస్ 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన తొలి రోజు ఆటలో ఐదు వికెట్లకు 122 పరుగులు చేసిన టీమిండియా ఈ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించి 165 పరుగులకు ఆలౌటైంది. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌట్ కావడంతో భారత్ కోలుకోలేని దెబ్బతిన్నది. రవిచంద్రన్ అశ్విన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని వికెట్ టిమ్ సౌథీకి లభించింది. ఇశాంత్ శర్మ 5 పరుగులు చేసి, కేల్ జమీసన్ బౌలింగ్‌లో వాల్టింగ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. 20 బంతుల్లో 21 పరుగులు సాధించిన మహమ్మద్ షమీని టామ్ బ్రండెల్ క్యాచ్ పట్టగా సౌథీ పెవిలియన్‌కు పంపడంతో, 68.1 ఓవర్లలో 165 పరుగుల వద్ద భారత్ ఆలౌటైంది. అప్పటికి మూడు బంతులు ఎదుర్కొన్న జస్‌ప్రీత్ బుమ్రా పరుగుల ఖాతా తెరవకుండా నాటౌట్‌గా ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 49 పరుగులకు నాలుగు, కేల్ జమీసన్ 39 పరుగులకు 4 చొప్పున వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ లభించింది.
భారత్‌ను తక్కువ స్కోరుకే నిలువరించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, 26 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను టామ్ లాథమ్ రూపంలో చేజార్చుకుంది. 11 పరుగులు చేసిన అతనిని, రిషభ్ పంత్ క్యాచ్ పట్టగా ఇశాంత్ ఔట్ చేశాడు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు కనిపించిన టామ్ బ్లండెల్‌ను కూడా ఇశాంత్ పెవిలియన్‌కు పంపాడు. 80 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసిన అతనిని ఇశాంత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు వీరు అత్యంత కీలకమైన 93 పరుగులు జత చేశారు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న టేలర్ 71 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి, ఇశాంత్ బౌలింగ్‌లోనే చటేశ్వర్ పుజారా క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. తర్వాత కొద్ది సేపటికి విలియమ్‌సన్ వికెట్ కూడా కూలింది. 153 బంతులు ఎదుర్కొన్న అతను 89 పరుగులు చేసి, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అతని స్కోరులో 11 ఫోర్లు ఉన్నాయి. హెన్రీ నికోల్స్ 62 బంతుల్లో 17 పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చిక్కగా, వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి బీజే వాల్టింగ్ 14, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ 71.1 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకొని 216 పరుగులు సాధించింది. ఇశాంత్ 31 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ సాధించారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 122): పృథ్వీ షా బీ టిమ్ సౌథీ 16, మాయాంక్ అగర్వాల్ సీ కేల్ జెమీసన్ బీ ట్రెంట్ బౌల్ట్ 34, చటేశ్వర్ పుజారా సీ వాల్టింగ్ బీ కేల్ జమీసన్ 11, విరాట్ కోహ్లీ సీ రాస్ టేలర్ బీ కేల్ జమీసన్ 2, అజింక్య రహానే సీ వాల్టింగ్ బీ టిమ్ సౌథీ 46, హనుమ విహారీ సీ వాల్టింగ్ బీ కేల్ జమీసన్ 7, రిషభ్ పంత్ రనౌట్ 19, రవిచంద్రన్ అశ్విన్ బీ టిమ్ సౌథీ 0, ఇశాంత్ శర్మ సీ వాల్టింగ్ బీ కేల్ జమీసన్ 5, మహమ్మద్ షమీ సీ టామ్ బ్లండెల్ బీ టిమ్ సౌథీ 21, జస్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 165.
వికెట్ల పతనం: 1-16, 2-35, 3-40, 4-88, 5-101, 6-132, 7-132, 8-143, 9-165, 10-165.
బౌలింగ్: టిమ్ సౌథీ 20.1-5-49-4, ట్రెంట్ బౌల్ట్ 18-2-57-1, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 11-5-12-0, కేల్ జమీసన్ 16-3-39-4, అజాజ్ పటేల్ 3-2-7-0.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: టామ్ లాథమ్ సీ రిషభ్ పంత్ బీ ఇశాంత్ శర్మ 11, టామ్ బ్లండెల్ బీ ఇశాంత్ శర్మ 30, కేన్ విలియమ్‌సన్ సీ (సబ్‌స్టిట్యూట్) రవీంద్ర జడేజా బీ మహమ్మద్ షమీ 89, రాస్ టేలర్ సీ చటేశ్వర్ పుజారా బీ ఇశాంత్ శర్మ 44, హెన్రీ నికోల్స్ సీ విరాట్ కోహ్లీ బీ రవిచంద్రన్ అశ్విన్ 17, బీజే వాల్టింగ్ 14 నాటౌట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (71.1 ఓవర్లలో 5 వికెట్లకు) 216.
వికెట్ల పతనం: 1-26, 2-73, 3-166, 4-185, 5-207.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 18.1-4-62-0, ఇశాంత్ శర్మ 15-6-31-3, మహమ్మద్ షమీ 17-2-61-1, రవిచంద్రన్ అశ్విన్ 21-1-60-1.

*చిత్రం...ఇశాంత్ శర్మ 15-6-31-3