క్రీడాభూమి

ఆసియా రెజ్లింగ్‌లో రవికి స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం మరో స్వర్ణ పతకం లభించింది. 57 కిలోల విభాగంలో పోటీ పడిన రవి దహి యా 10-0 తేడాతో తజకిస్థాన్‌కు చెందిన హికుమాతుల్లో వహి దోవ్ నుంచి చిత్తు చేసి, స్వర్ణ పతకం అందుకున్నాడు. అతని ధా టికి వహిదోవ్ ఏ దశలోనూ ఎదురు నిలువలేకపోయాడు. కా గా, 65 కిలోల విభాగంలో టైటిల్ సాధించే అవకాశాలు ఉన్న బజరంగ్ పునియా ఫైనల్లో తకుతో ఒతొగురో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని రజత పకంతో సంతృప్తి చెందాడు. అ దే విధంగా 79 కిలో ల విభాగంలో గౌరవ్ బలియన్ తన ప్రత్య ర్థి అర్సలాన్ బడజ పొవ్‌ను నిలువరించలేక, రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అదే విధంగా మొజ్‌తబా గొలెజ్ చేతిలో ఓడిన సత్యవ్రత్ కడి యన్ కూడా రజతానికి పరిమిత మయ్యాడు. 70 కిలోల విభా గంలో కాంస్య పతకం కోసం నవీన్ చేసిన పోరాటం ఫలించ లేదు. అతనిని కజకస్థాన్ రెజ్లర్ మెయర్జాన్ అషిరోవ్ సులభంగా ఓడించాడు.
*చిత్రం...పురుషుల 57 కిలోల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిపెట్టిన రవి దహియా