క్రీడాభూమి

గోవాపై గుజరాత్ భారీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్సాద్, ఫిబ్రవరి 23: రంజీట్రోఫీ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్‌లో గుజరాత్ జట్టు గోవాపై 464 పరుగుల భారీ విజయా న్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజ రాత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయ 602 పరుగులు చేసింది. కెప్టెన్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (124), రూష్ కలరియా (118) సెంచ రీలతో చెలరేగగా, భార్గవ్ మెరయ (84), అక్షర్ పటేల్ (80), చింతన్ గజ (56) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన గోవా జట్టు 173 పరుగులకే కుప్పకూ లింది. చింతన్ గజ 5 వికెట్లతో చెలరే గాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ 6 వికెట్లు కోల్పోయ 199 పరుగులకు డిక్లేర్ చేసింది. దీంతో 628 పరుగుల లక్ష్యంతో రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన గోవా 164 పరుగులకే ఆలౌటైంది. దీంతో గుజరాత్ జట్టు 464 పరుగుల తేడాతో విజయం సాధించింది.