క్రీడాభూమి

రెండో ర్యాంకులో కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఫిబ్రవరి 26: టీమిండియా కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. తాజాగా అంత ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ ఒక స్థానం దిగజారి 906 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ నిరాశ పరిచిన విష యం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యా ట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయంట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక ఇటీవల భార త్ జరిగిన టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 853 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 827 పాయింట్ల ఒక స్థానం దిగజారి నాలుగో స్థా నంలో చోటు దక్కించుకోగా, పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ 800 రేటింగ్ పాయంట్లతో టాప్-5లో నిలిచాడు. ఇక ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (793), ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 764 రేటింగ్ పాయంట్లతో 6, 7 స్థానా ల్లో నిలిచారు. టాప్-10లో చివరి మూడు స్థానాల్లో భారత బ్యాట్స్‌మెన్లు అజింక్యా రహా నే (760), చటేశ్వర్ పుజారా (757), మయాంక్ అగర్వాల్ (727) రేటింగ్ పాయంట్లతో టాప్-10లో నిలిచారు. బ్యాట్స్‌మెన్ల జాబితా లో భారత్ నుంచి మొత్తం నలుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అశ్విన్ ఒక్కడికే చోటు..
మరోవైపు ఐసీసీ ప్రకటించిన బౌలర్ల జాబితాలో టీమిండియా నుంచి రవించంద్ర న్ అశ్విన్‌కు మాత్రమే చోటు దక్కింది. అశ్విన్ ఒక స్థానం దిగజారి 765 రేటింగ్ పాయం ట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ (904) రేటింగ్ పాయిం ట్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. కివీస్ పేసర్ నెల్ వాగ్నర్ 843 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ స్టార్ బౌలర్ జాసన్ హోల్డర్ (830), దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబద (802), ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (796) రేటింగ్ పాయంట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగారు. అయతే టాప్-5లో ఎలాంటి మార్పుల్లేకపోవడం గమనార్హం. టీమిండియా తో జరుగుతున్న తొలి టెస్టులో 9 వికెట్లతో రాణించిన టీమ్ సౌథీ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగు పరుచుకొని 794 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నా డు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (775), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్‌వుడ్ (769) పాయింట్లతో 7,8 స్థానాల్లో నిలవగా, వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ (763) రేటింగ్ పాయింట్ల తో టాప్-10లో చివరి స్థానంలో నిలిచాడు.
*చిత్రాలు.. విరాట్ కోహ్లీ
*జస్ప్రీత్ బుమ్రా