క్రీడాభూమి

ఘోర పరాభవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 24: అంతా ఊహించినట్లే జరిగింది. న్యూజిలాండ్ పర్యటనలో ప్రపంచ నెం.1 జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభా గాల్లో చతికిలబడ్డ కోహ్లీసేన మరో రోజు మిగిలి ఉండగా నే ప్రత్యర్థి బౌలర్ల ముందు తలవంచింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 1-0 తేడాతో వెనుజంలో నిలిచింది.
మరో 47 పరుగులే..
ఓవర్ నైట్ స్కోర్ 144/4 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే అజింక్యా రహానే (29) వికెట్‌ను కోల్పోయం ది. ఆ తర్వాతి ఓవర్‌లోనే హనుమ విహారి (15) సైతం అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక చివర్లో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (4), ఇషాంత్ శర్మ (12), జస్ప్రీత్ బుమ్రా (0)ను సౌథీ, డీగ్రాండ్ హోం పెవిలియన్‌కు పంపడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కోహ్లీసేన ప్రత్యర్థి జట్టుకు అప్పటికే 9 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశంచగా, 1.4 ఓవర్లలోనే న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు సాధించిన కివీ పేసర్ టీమ్ సౌథీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.