క్రీడాభూమి

లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాపై కివీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 29: మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా కొనసాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో ఓడించింది. అసాధారణ బౌలింగ్ ప్రతిభ కనబరచిన సీమర్ హేలీ జెనె్సన్, ఆఫ్ స్పిన్నర్ లీ కాస్పెరెక్ న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది. రాచెల్ ప్రీస్ట్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. బంగ్లాదేశ్ బౌలర్ రితూ మోనీ 18 పరుగులకు నాలుగు వికెట్లు సాధించగా, సల్మా ఖటూన్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. అత్యంత సులభమైన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సులభంగా చేరుకుంటుందని అంతా ఊహించారు. కానీ, అందుకు భిన్నంగా కివీస్ బౌలర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. నిగల్ సుల్తానా జోటీ 21 పరుగులు చేయగలిగినా, మిగతా వారు ఆ మాత్రం కూడా రాణించలేకపోవడంతో, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు 19.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. హేలీ జెన్సన్ 11 పరుగులకు మూడు, లీ కాస్పెరెక్ 23 పరుగులకు మూడు చొప్పున వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 18.2 ఓవర్లలో 91 ఆలౌట్ (రాచెల్ ప్రీస్ట్ 25, రితూ మోనీ 4/18, సల్మా ఖటూన్ 3/7).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 19.5 ఓవర్లలో 74 ఆలౌట్ (నిగర్ సుల్తానా 21, హీలీ జెనె్సన్ 3/11, లీ కాస్పెరెక్ 2/23).