క్రీడాభూమి

భారత్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 29: ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు దూకుడును కొనసాగిస్తున్నది. గ్రూప్ దశలో శనివారం జరిగిన చివరి, నాలుగో మ్యాచ్‌ని గెల్చుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసి, గ్రూప్ ‘ఏ’లో అగ్రస్థానాన్ని ఆక్రమించి, అధికారికంగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. షఫాలీ వర్మ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ చామరి అటపత్తు 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, టెయిలెండర్ కవిషా దిల్హరి 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మిగతా వారంతా విఫలం కావడంతో లంక గౌరవ ప్రదమైన స్కోరు చేయలేకపోయింది. ఈ టోర్నీలో గొప్పగా రాణిస్తున్న రాధా యాదవ్ 23 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, లంక ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 14.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి, 116 పరుగులు సాధించింది. గ్రూప్ ‘ఏ’లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. షఫాలీ వర్మ 34 బంతుల్లో 47 పరుగులు సాధించి, భారత్ విజయానికి గట్టిపునిదా వేసింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 (చామరి అటపత్తు 33, కవిషా దిల్హరి 25 నాటౌట్, రాధా యాదవ్ 4/23, రాజేశ్వరి గైక్వాడ్ 2/18, దీప్తీ శర్మ 1/16, శిఖా పాండే 1/35).
భారత్ ఇన్నింగ్స్: 14.4 ఓవర్లలో 3 వికెట్లకు 116 (షఫాలీ వర్మ 47, స్మృతి మందానా 17, హర్మన్‌ప్రీత్ కౌర్ 15, జెమీమా రోడ్రిగ్స్ 15 నాటౌట్, దీప్తీ శర్మ 15 నాటౌట్, ఉదేషికా ప్రబోధని 1/13, శశికరణ సిరివర్దనే 1/42).
*ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. అనంతరం, ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మూడు పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా శ్రీలంకపై ఏడు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందడం ద్వారా గ్రూప్ ‘ఏ’లో అజేయ జట్టుగా, నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ విజయంతో అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

*చిత్రాలు.. స్వీప్ షాట్ కొడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ
* శ్రీలంక కెప్టెన్ చామరి అటపత్తు వికెట్‌ను పడగొట్టిన భారత బౌలర్ రాధా యాదవ్‌కు తోటి క్రికెటర్ల అభినందన