క్రీడాభూమి

టీమిండియా 242 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన రెండవ, చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 242 పరుగులకే ఆలౌటైంది. యువ ఓపెనర్ పృథ్వీ షా, ‘టెస్టు స్పెషలిస్టు’ చటేశ్వర్ పుజారా, తెలుగు తేజం హనుమ విహారీ అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ కేల్ జమీసన్ ఐదు వికెట్లు పడగొట్టి, భారత్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో, భారత్ ఇన్నింగ్స్‌ను షా, మాయాంక్ అగర్వాల్ ప్రారంభించారు. జట్టు స్కోరు 30 పరుగులవద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అగర్వాల్ ఎల్‌బీగా వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న షా 64 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగు చేసి కేల్ జమీసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 బంతులు ఎదుర్కొని, కేవలం మూడు పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయి, అభిమానులను నిరాశపరిచాడు. అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా ఆచితూచి ఆడుతుండగా, అతనికి సరైన సహకారాన్ని ఇవ్వలేకపోయిన అరానే 7 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, టిమ్ సౌథీ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు దొరికాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన విహారీ స్కోరుబోర్డును వేగంగా కదిలించాడు. పుజారాతో కలిసి అతను ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. 70 బంతులు ఎదుర్కొని, పది ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసిన అతనిని వాల్టింగ్ క్యాచ్ పట్టగా, నీల్ వాగ్నర్ వెనక్కు పంపాడు. అప్పటికి భారత్ స్కోరు 194 పరుగులు. మరో మూడు పరుగుల తర్వాత పుజారా ఇన్నింగ్స్‌కు తెరపడింది. క్రీజ్‌లో పాతుకుపోయి, 140 బంతులు ఎదుర్కొన్న అతను 54 పరుగులు సాధించి, కేల్ జమీసన్ బౌలింగ్‌లో వాల్టింగ్‌కు చిక్కాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు ఉన్నాయి. పుజారా వికెట్ కూలిన తర్వాత మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (12), ఉమేష్ యాదవ్ (0), రవీంద్ర జడేజా (9), మహమ్మద్ షమీ (16) ఒకరి తర్వాత మరొకరుగా వెనుదిరిగారు. 63 ఓవర్లలో భారత్ 242 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి జస్‌ప్రీత్ బుమ్రా 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కేల్ జమీసన్ 14 ఓవర్లు బౌల్ చేసి, 45 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ 38 పరుగులకు రెండు, ట్రెంట్ బౌల్ట్ 89 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. నీల్ వాగ్నర్‌కు ఓ వికెట్ లభించింది.
న్యూజిలాండ్ 63 నో లాస్
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలండ్ మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసింది. టా మ్ లాథమ్ 27, టామ్ బ్లండెల్ 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ కంటే కివీస్ ఇంకా 179 పరుగులు వెనుక బడి ఉంది. అయతే, పది వికెట్లు చేతిలో ఉన్నాయ.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా సీ టామ్ లాథమ్ బీ కేల్ జమీసన్ 54, మాయాంక్ అగర్వాల్ ఎల్‌బీ ట్రెంట్ బౌల్ట్ 7, చటేశ్వర్ పుజారా సీ వాల్టింగ్ బీ కేల్ జమీసన్ 54, విరాట్ కోహ్లీ ఎల్‌బీ టిమ్ సౌథీ 3, అజింక్య రహానే సీ రాస్ టేలర్ బీ టిమ్ సౌథీ 7, హనుమ విహారీ సీ వాల్టింగ్ బీ నీల్ వాగ్నర్ 55, రిషభ్ పంత్ బీ కేల్ జమీసన్ 12, రవీంద్ర జడజే సీ ట్రెంట్ బౌల్ట్ బీ కేల్ జమీసన్ 9, ఉమేష్ యాదవ్ సీ వాల్టింగ్ బీ కేల్ జమీసన్ 0, మహమ్మద్ షమీ బీ ట్రెంట్ బౌల్ట్ 16, జస్‌ప్రీత్ బుమ్రా 10 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 242.
వికెట్ల పతనం: 1-30, 2-80, 3-85, 4-113, 5-194, 6-197, 7-207, 8-207, 9-216, 10-242.
బౌలింగ్: టిమ్ సౌథీ 13-5-38-2, ట్రెంట్ బౌల్ట్ 17-2-89-2, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 9-2-31-0, కేల్ జమీసన్ 14-3-45-5, నీల్ వాగ్నర్ 10-2-29-1.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: టామ్ లాథమ్ 27 నాటౌట్, టామ్ బ్లండెల్ 29 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (23 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 63.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 7-1-19-0, ఉమేష్ యాదవ్ 8-1-20-0, మహమ్మద్ షమీ 7-1-17-0, రవీంద్ర జడేజా 1-1-0-0.
*చిత్రాలు.. 55 పరుగులతో రాణించిన తెలుగు వీరుడు హనుమ విహారీ
**45 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టిన కేల్ జమీసన్