క్రీడాభూమి

సెమీస్‌కు ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 1: ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ సెమీస్‌కు దూసుకెళ్లిం ది. ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఈ జట్టు వెస్టిండీస్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగు లు సాధించింది. ఓపెనర్ డానియేల్ వ్యాట్ 29, నటాలీ షివర్ 57, అమె ఎలెన్ జోన్స్ 23 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లు షకిరా సెల్మాన్, అలీ ఫ్లెచర్, అనిసా మహమ్మద్, స్ట్ఫానీ టేలర్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లీ ఆన్ కిర్బీ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బ్రిట్నీ కూపర్ 15 పరుగులు సాధించింది. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. సోఫీ ఎక్సెల్‌స్టోన్ కేవలం 7 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, సారా గ్లెన్ 16 పరుగులకు రెండు వికెట్లు సాధించింది.
పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు
మరో గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా 17 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వొల్వా ర్ట్ 53 పుగులు సాధించగా, మారిజానే కాప్ 31 పరుగులు చేసింది. డియానా బేగ్ 19 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చింది. అనంతరం పాకిస్తాన్ లక్ష్యా న్ని ఛేదించడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేతిలో వికె ట్లు ఉన్నప్పటికీ, పాక్ మహిళలు దాడులకు ఉపక్రమించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ జట్టులో అలియా రియాజ్ 39 పరుగులు సాధించగా, కెప్టెన్ జవెరియా ఖాన్ 31 పరుగులు చేసింది.
*చిత్రం... రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతున్న విండీస్ కెప్టెన్ స్ట్ఫానీ టేలర్