క్రీడాభూమి

షెల్డన్ జాక్సన్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: మిడిల్ ఆర్డర్ మ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ సెంచరీ సాధించడంతో, గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 304 పరుగులు చేయగలిగింది. ఐదు వికెట్లకు 217 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్టక్రు షెల్డన్ అండగా నిలిచాడు. చిరాగ్ జానీ 29 పరుగులు చేయగా, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్ర సింగ్ జడేజా చెరి 15 పరుగులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. గుజరాత్ బౌలర్ అర్జాన్ నాగ్వాస్వాలా 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
అక్షర్ పటేల్‌కు మూడు వికెట్లు లభించాయి. రూష్ కలారియా రెండు వికెట్లు సాధించాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన గురజాత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ధ్రువ్ రావల్ 35 పరుగులు చేయగా, కెప్టెన్ పార్థీవ్ పటేల్ 27 పరుగులు సాధించాడు. రుజుల్ భట్ 27, అక్షర్ పటేల్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సౌరాష్ట్ర కంటే ఇంకా 185 పరుగులు వెనుకబడి ఉన్న గుజరాత్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.