క్రీడాభూమి

నెంబర్ వన్.. వైట్‌వాష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్ట్‌చర్చ్: మొన్నటి వరకు టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయంచిన కోహ్లీసేనకు న్యూజిలాండ్ గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఊహించని విధంగా వైట్‌వాష్‌కు గురైంది. నెంబర్ వన్ జట్టు కనీసం పోరాట పటిమ కూడా చూపించకుండా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. దీంతో ఐదు రోజుల టెస్టును కాస్త మూడు రోజుల్లోనే ముగించింది.
తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 90/6తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన 124 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారి (9), రిషభ్ పంత్ (4), మహ్మద్ షమీ (5), జస్ప్రీత్ బుమ్రా (4) కనీసం పోరాట పటిమ కనబరచలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీయగా, టిమ్ సౌథీ 3, కొలిన్ డి గ్రాండ్ హోం, నెల్ వాగ్నార్‌లు ఒక్కో వికెట్ తీశారు.
రాణించిన ఓపెనర్లు..
అనంతరం 131 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 36 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (52), టామ్ బ్లండెల్ (55) అర్ధ సెంచరీలు సాధించగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) తక్కువ స్కోరుకే అవుటైనా, మిగతా పనిని రాస్ టేలర్ (5, నాటౌట్), హెన్రీ నికోల్స్ (5, నాటౌట్) పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో 14 వికెట్లు తీసిన టిమ్ సౌథీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కగా, కైల్ జెమీసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
స్కోర్ బోర్డు..
భారత్ మొదటి ఇన్నింగ్స్: 242 ఆలౌట్
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 235 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సీ) లాథమ్ (బీ) సౌథీ 14, మయాంక్ అగర్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) బౌల్ట్ 3, చటేశ్వర్ పుజారా (బీ) బౌల్ట్ 24, విరాట్ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బీ) కొలిన్ డి గ్రాండ్ హోం 14, అజింక్యా రహానే (బీ) వాగ్నార్ 9, ఉమేశ్ యాదవ్ (బీ) బౌల్ట్ 1, హనుమ విహారి (సీ) వాట్లింగ్ (బీ) సౌథీ 9, రిషభ్ పంత్ (సీ) వాట్లింగ్ (బీ) బౌల్ట్ 4, రవీంద్ర జడేజా (నాటౌట్) 16, మహ్మద్ షమీ (సీ) టామ్ బ్లండెల్ (బీ) సౌథీ 5, జస్ప్రీత్ బుమ్రా (రనౌట్) బౌల్ట్/విలియమ్సన్ 4.
ఎక్స్‌ట్రాలు: 21 మొత్తం: 124 (46 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-8, 2-26, 3-51, 4-72, 5-84, 6-89, 7-97, 8-97, 9-108, 10-124.
బౌలింగ్: టిమ్ సౌథీ 11-2-36-3, ట్రెంట్ బౌల్ట్ 14-4-28-4, కైల్ జెమీసన్ 8-4-18-0, కొలిన్ డి గ్రాండ్ హోం 5-3-3-1, నెల్ వాగ్నార్ 8-1-18-1.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: టామ్ లాథమ్ (సీ) పంత్ (బీ) ఉమేశ్ 52, టామ్ బ్లండెల్ (బీ) బుమ్రా 55, కేన్ విలియమ్సన్ (సీ) రహానే (బీ) బుమ్రా 5, రాస్ టేలర్ (నాటౌట్) 5, హెన్రీ నికోల్స్ (నాటౌట్) 5.
ఎక్స్‌ట్రాలు: 10 మొత్తం: 132 (36 ఓవర్లలో 3 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-103, 2-112, 3-121
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 13-2-39-2, ఉమేశ్ యాదవ్ 14-3-45-1, మహ్మద్ షమీ 3-1-11-0, రవీంద్ర జడేజా 5-0-24-0, విరాట్ కోహ్లీ 1-0-4-0.

*చిత్రం...టెస్టు సిరీస్‌తో న్యూజిలాండ్ జట్టు