క్రీడాభూమి

ఫైనల్‌కు సౌరాష్ట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మార్చి 4: రంజీట్రోఫీ సెమీ ఫైనల్‌లో గుజరాత్‌పై సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 9/1 పరుగులతో చివరి రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ 234 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (93), చిరాగ్ గాంధీలు త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, మిగతా బ్యాట్స్‌మెన్లం తా పూర్తిగా విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో జయదేవ్ ఉనద్కాత్ 7 వికెట్లు తీయగా, ధర్మేంద్రసిన్హా జడేజా, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ ఒక్కో వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
స్కోర్ బోర్డు..
సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్: 304 (ఆలౌట్)
గుజరాత్ మొదటి ఇన్నింగ్స్: 252 (ఆలౌట్)
సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్: 274 (ఆలౌట్)
గుజరాత్ రెండో ఇన్నింగ్స్: సమిత్ గోహెల్ (సీ) హర్విక్ దేశాయ (బీ) ఉనద్కాత్ 5, ప్రియాంక్ పంచల్ (సీ) డీఏ జడేజా (బీ) ఉనద్కాత్ 0, భార్గవ్ మేరాయ (ఎల్బీడబ్ల్యూ) (బీ) ప్రేరక్ మన్కడ్ 14, ధ్రువ్ రావల్ (సీ), (బీ) ఉనద్కాత్ 5, పార్థీవ్ పటేల్ (సీ) హర్విక్ దేశాయ (బీ) ఉనద్కాత్ 93, రాజుల్ భట్ (సీ) జాక్సన్ (బీ) చిరాగ్ జానీ 1, చిరాగ్ గాంధీ (బీ) ఉనద్కాత్ 96, అక్షర్ పటేల్ (సీ), (బీ) ఉనద్కాత్ 0, రూష్ కలరియా (సీ) బరోత్ (బీ) డీఏ జడేజా 1, చింతన్ గజా (నాటౌట్) 4, అర్జాన్ నగ్వాసల్లా (సీ) హర్విక్ దేశాయ (బీ) ఉనద్కాత్ 4.
ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం: 234 (72.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-1, 2-7, 3-18, 4-60, 5-63, 6-221, 7-221, 8-226, 9-226, 10-234.
బౌలింగ్: జయదేవ్ ఉనద్కాత్ 22.2-11-56-7, చేతన్ సకరియా 14-3-51-0, ధర్మేంద్రసిన్హా జడేజా 17-3-47-1, చిరాగ్ జానీ 7-0-33-1, ప్రేరక్ మన్కడ్ 12-2-39-1.