క్రీడాభూమి

ఆసీస్ ఆరోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 5: మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయాస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 134 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లెన్నింగ్ (49, నాటౌట్)కు తోడు, బేత్ మూనీ (28), వికెట్ కీపర్ ఎలీసా హేలీ (18), రఖేల్ హేన్స్ (17) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ డి క్లెర్క్ 3 వికెట్లు పడగొట్టగా, అయబొంగ ఖాకా, నాన్‌కుల్‌లెకో లాబా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
పాపం సఫారీలు..
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసినా సఫారీలు ఇక మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే అనుకున్నారు. అయతే అనూహ్యాంగా వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్ వర్త్ లూయాస్ పద్ధతిలో 13 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యంగా నిర్ణయంచారు. దీంతో బ్యాటింగ్ వచ్చిన దక్షిణాఫ్రికా 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో లిజెల్లీ లీ (10), కెప్టెన్ డేన్ వన్ నీకెర్క్ (12), మిగ్నాగ్ డుప్రీజ్ (0) , క్లో ట్రయాన్ (1) తక్కువ స్లోర్లకే అవుటైనా సున్ లూస్ (21), లారా వోల్వార్ట్ (41, నాటౌట్), నదిన్ డి క్లెర్క్ (6, నాటౌట్) చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయంది. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. అయతే పురుషుల క్రికెట్ లాగే మహిళా క్రికెట్‌ను వరుణుడు అడ్డుకున్నాడంటూ పలువురు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది.
స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా వుమెన్ ఇన్నింగ్స్: ఎలీస్సా హేలీ (సీ) వన్ నీకెర్క్ (బీ) అయబొంగ ఖాకా 18, బేత్ మూనీ (బీ) నదీన్ డి క్లెర్క్ 28, మెగ్ లన్నింగ్ (నాటౌట్) 49, జెస్ జొనస్సెన్ (సీ) ఇస్మాయల్ (బీ) లాబా 1, అష్లే గార్డ్‌నర్ (సీ) చెట్టీ (బీ) నదీన్ డి క్లెర్క్ 0, రఖేల్ హేన్స్ (బీ) నదీన్ డి క్లెర్క్ 17, నికోలా క్యారీ (నాటౌట్) 7.
ఎక్స్‌ట్రాలు: 14 మొత్తం: 134 (20 ఓవర్లలో 5 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-34, 2-68, 3-69, 4-71, 5-103.
బౌలింగ్: షబ్నీమ్ ఇస్మాయల్ 4-0-20-0, అయబొంగ ఖాకా 4-0-29-1, నాన్‌కుల్‌లెకో లాబా 3-0-18-1, డేన్ వన్ నీకెర్క్ 2-0-20-0, నదీన్ డి క్లెర్క్ 4-0-19-3, క్లో ట్రయాన్ 3-0-20-0.
దక్షిణాఫ్రికా వుమెన్ ఇన్నింగ్స్: లిజెల్లీ లీ (సీ) గార్డ్‌నర్ (బీ) మోలినిక్స్ 10, డేన్ వన్ నికెర్ క (బీ) స్కచ్ 21, సున్ లూస్ (సీ) మూనీ (బీ) స్కచ్ 21, మిగ్నాన్ డు ప్రీజ్ (సీ) లన్నింగ్ (బీ) డెలిస్సా కిమ్మిన్స్ 0, లారా వోల్వార్డ్ (నాటౌట్) 41, క్లో ట్రయాన్ (సీ) లన్నింగ్ (బీ) జొనస్సేన్ 1, నదీన్ డి క్లెర్క్ (నాటౌట్) 6.
ఎక్స్‌ట్రాలు: 1 మొత్తం: 92 (13 ఓవర్లలో 5 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-20, 2-23, 3-24, 4-71, 5-79.
బౌలింగ్: మెగ్నాగ్ స్కచ్ 3-0-17-2, జెస్ జొనస్సేన్ 3-0-28-1, సోఫీ మోలినిక్స్ 2-0-16-1, డెలిస్సా కిమ్మిన్స్ 3-0-16-1, నికోలా క్యారీ 2-0-15-0.
*చిత్రం...దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆనందం