క్రీడాభూమి

మొదటిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: అంతా అనుకున్నట్లే జరిగింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ మ్యాచు ల్లో పాయింట్ల ఆధారంగా టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్‌కు ప్రారంభం ముందు నుంచే సిడ్నీలో భారీ వర్షం పడడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడ లేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించా రు. మరోవైపు రిజర్వ్ డే కూడా లేకపోవడంతో ఇంగ్లాండ్‌కు నిరాశ తప్పలేదు. కాగా, ఈ నెల 8న భారత్ తుది పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
దురదృష్టకరం..
దీనిపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ భారత్ ఫైనల్‌కు చేరడంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే సెమీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవడంపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. మెగా టోర్నీలో కనీసం సెమీ ఫైనల్స్, పైనల్ మ్యాచుల్లో రిజర్వ్ డే ఉంటే బాగుండేది. మ్యాచ్ ఇలా ము గి యడం నిజంగా దురదృష్టక రమే. మేం టోర్నీకి ముందు నుంచే అన్ని మ్యాచుల్లో గెల వాలనుకున్నామని పేర్కొంది. ప్ర స్తుతం ఫైనల్‌కు వచ్చామం టే అది జట్టు సమష్టి రాణిం పేనని వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్‌లో తప్పకుండా రాణిస్తామ ని ఆశాభావం వ్యక్తం చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన మంచి భాగస్వామ్యాలు అందిస్తున్నా, దానిని ముం దుకు తీసుకెళ్లడంలో టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమైందని, గత మ్యాచుల్లో జరిగిన పొరపాట్లను ఫైనల్‌లో సరిచేసుకుంట మని చెప్పింది. అయితే టీ20ల్లో వెనుకబడితే ఒత్తిడిని జయించడం కష్టమేనని, ముందునుంచే ప్రణాళిక బద్దంగా ఆడాలని జట్టు సభ్యులకు సూచించింది.
ఆ మ్యాచే కొంపముంచింది..
మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ దీనిపై స్పందిస్తూ భావోద్వేగం చెందింది. మెగాటోర్నీ నుంచి ఇలా నిష్క్రమిస్తామని తాము అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నిబంధనలు అలా ఉండడంతో తాము చేసేదేమీ లేదని పేర్కొంది. ఐసీసీ మెగా టోర్నీల్లో కీలక మ్యాచుల్లో రిజర్వ్ డే పెడితే బాగుండేదని అభిప్రాయపడింది. తాము సెమీస్ నుంచి నిష్క్ర మించడానికి గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడి పోవడమే ప్రధాన కారణమని చెప్పింది. ఇదిలాఉంటే గ్రూప్ దశలో టీమిండియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి 8 పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్‌లో నిలవగా, ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా మిగతా మూడింటిలోనూ విజయం సాధించి 6 పాయింట్లతో గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయతే భారత్ కంటే ఇంగ్లాండ్‌కు మెరుగైన రన్‌రేట్ ఉన్నా పాయింట్ల ఆధారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అర్థ రహితం..
సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, టీమిండియా ఫైనల్‌కి చేరడంతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా ఐసీసీపై అసహనం వ్యక తం చేశాడు. ఇది అర్ధ రహితమైన చర్యగా ట్వీట్ చేశాడు. జీవితంలో అతి పెద్ద మ్యాచ్ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయతే టోర్నీకి ముందే వర్షాలు పడుతున్న కారణంగా మ్యాచ్‌కు రిజర్వ్ డే ప్రకటించాలని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ఐసీసీని కోరినా, అందుకు ఐసీసీ నిరాకరించిన విషయం తెలిసిందే.

ఇదో పెద్ద ఘనత..

టీమిండియా ఫైనల్‌కు చేరడంతో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. ‘కంగ్రాట్స్ గర్ల్స్.. ఇదో పెద్ద ఘనత’ అంటూ ట్వీట్ చేసింది. అయతే అనూహ్యాంగా సెమీస్ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్‌పై సానుభూతి వ్యక్తం చేసింది. ఒక భారతీయురాలిగా జట్టు ఫైనల్‌కు చేరడాన్ని థ్రిల్‌గా ఫీలవుతానని, కానీ క్రికెటర్‌గా మాత్రం ఇంగ్లాండ్‌ను చూస్తే జాలేస్తుందని పేర్కొంది. తాను ఈ తరహా పరిస్థితిని ఎప్పుడు కోరుకోనని, అయతే నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే నని చెప్పింది.

*చిత్రం... టీమిండియా ఆనందం
* (ఇన్‌సెట్‌లో) టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్