క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌కు అమిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాన్ (జోర్డాన్), మార్చి 7: ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగోలియాకు చెందిన ఎకామనడాక్ ఖర్ఖూపై అతను అత్యంత కష్టం మీద గెలుపొందాడు. న్యాయ నిర్ణేతల నిర్ణయం అమిత్‌కు అనుకూలంగా మూడు, వ్యతిరేకంగా రెండు చొప్పున వెలువడింది. పురుషుల 52 కిలోల విభాగంలో పోటీ పడుతున్న 23 ఏళ్ల అమిత్ రింగ్‌లో అత్యంత వేగంగా కదులుతూ ప్రత్యర్థిపై దాడులకు ప్రయత్నించాడు. అయితే, ఖర్ఖూ సైతం అదే స్థాయిలో పంచ్‌లు విసరడంతో పోరు ఆసక్తికరంగా కొనసాగింది. ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపింది. చివరికి ఎక్కువ మంది ఓట్లతో అమిత్ విజయం సాధించాడు.

*చిత్రం... భారత బాక్సర్ అమిత్ పంగల్