క్రీడాభూమి

క్రికెట్‌కు జాఫర్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 7: సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లి వంటి మేటి ఆటగాళ్లతో పోల్చతగ్గ బ్యాటింగ్ నైపుణ్యంతో, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వసీం జాఫర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 42 ఏళ్ల జాఫర్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, భవిష్యత్తులో కోచ్‌గా లేదా కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వ్యాఖ్యానించాడు. పాఠశాల రోజుల నుంచి అంతర్జాతీయ కెరీర్ వరకూ తనకు అన్ని విధాలా సహకరించిన కోచ్‌లు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు. అదే విధంగా తనపై నమ్మకం ఉంచి, జాతీయ జట్టుకు ఎంపిక చేసిన సెలక్టర్లకు, తనకు అండగా ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు. ఇంగ్లాండ్‌లో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, తన కోసం భారత్‌కు వచ్చేసి, కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్న తన భార్యను సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలని అన్నాడు. తన కోచ్‌లు, కెప్టెన్లు, సహచరుల నుంచి ఎంతో నేర్చుకున్నానని, కెరీర్ ఎంతో ఆనందకరంగా గడిచిందని జాఫర్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అతను, ఆయా సంఘాల అధ్యక్షులు, సభ్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెవాగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి మేటి క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం రావడం తన అదృష్టమని అన్నాడు. సచిన్ తెండూల్కర్ గురించి మాట్లాడుతూ అతను తన రోల్ మోడల్ అని ప్రశంసించాడు. సచిన్ ఆటను చాలా దగ్గరగా చూసే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందిస్తున్నానని చెప్పాడు. బ్రియాల్ లారా, సచిన్ వంటి క్రికెటర్ల స్థాయిని అందుకోవడం సులభసాధ్యం కాదన్నాడు. కెరీర్‌లో అతను సచిన్, వినోద్ కాంబ్లీ, జహీర్ ఖాన్, అమోల్ మజుందార్, నీలేష్ కులకర్ణి వంటి క్రికెటర్లతో కలిసి ఆడాడు.
పరుగుల రారాజు
ముంబయి: దేశవాళీ క్రికెట్‌లో జాఫర్‌ను పరుగుల రారాజుగా పేర్కొంటారు. ముంబయిలో 1976 ఫిబ్రవరి 16న జన్మించిన వసీం జాఫర్ కెరీర్‌లో తన మొదటి (2000 ఫిబ్రవరి), చివరి (2008 ఏప్రిల్) టెస్టులతోపాటు మొదటి (2006 ఏప్రిల్), చివరి (2006 నవంబర్) వనే్డ ఇంటర్నేషనల్స్‌ను దక్షిణాఫ్రికాపైనే ఆడడం విశేషం. 31 టెస్టులు ఆడిన అతను 58 ఇన్నింగ్స్‌లో 1,944 పరుగులు సాధించాడు. 212 ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు. వెస్టిండీస్‌పై, వెస్టిండీస్‌లోనే డబుల్ సెంచరీ చేసిన అతి కొద్దిమంది భారత బ్యాట్స్‌మెన్‌లో జాఫర్ ఒకడు. మొత్తం మీద టెస్టుల్లో అతను ఐదు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. రెండు వనే్డ ఇంటర్నేషన్స్ ఆడి, కేవలం పది పరుగులు చేశాడు. టెస్టుల్లో 66 బంతులు వేసిన అతను 18 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అద్వితీయకు రికార్డు ఉంది. 256 మ్యాచ్‌ల్లో 19,211 పరుగులు చేశాడు. 57 సెంచరీలు, 89 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా అతను గుర్తింపు సంపాదించాడు. 314 (నాటౌట్) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు. రంజీ ట్రోఫీలో 12 వేలకుపైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. 150 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ అతనే. రెండు పర్యాయాలు ముంబయికి, ఒకసారి విదర్భకు రంజీ ట్రోఫీ టైటిల్ రావడంలో కీలక పాత్ర పోషించాడు.

*చిత్రం... వసీం జాఫర్