క్రీడాభూమి

గెలిస్తే చరిత్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో ఇంతకు ముందు రెండు పర్యాయాలు సెమీ ఫైనల్స్ చేరుకున్నప్పటికీ, ఫైనల్లోకి అడుగుపెట్టలేకపోయిన భారత జట్టు ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం పోరాడనుంది. మొదటిసారి ఫైనల్ చేరిన ఈ జట్టు గెలిస్తే, సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ, గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లను గెల్చుకొని, టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే, ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన భారత్ ఆతర్వాత బంగ్లాదేశ్‌పై 18 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం శ్రీలంకపై ఏడు వికెట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, ఐసీసీ నిబంధలను అనుసరించి, ఎక్కువ పాయింట్ల ఆధారంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.
మరోవైపు ఆసీస్ మొదటి మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొని ఓడినప్పటికీ, ఆతర్వాత తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. రెండు మ్యాచ్‌లో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. బంగ్లాదేశ్‌పై 86 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. న్యూజిలాండ్ చివరి వరకూ పోరాడినప్పటికీ, ఆసీస్ నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన సెమీ ఫైనల్లో, డక్‌వర్త్ లూయిస్ విధానంలో దక్షిణాఫ్రికాను ఐదు పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. కాగితంపై చూస్తే భారత్ కంటే ఎంతో బలంగా కనిపిస్తున్న ఆసీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హర్మన్‌ప్రీత్ బృందాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది వాస్తవం. ఈ తుది పోరులు ఎవరు గెలిచినా, ఒక గొప్ప మ్యాచ్‌ని తిలకించే అవకాశం క్రికెట్ అభిమానులకు దక్కనుంది.

*చిత్రాలు.. కోచ్, భారత మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్‌తో కలిసి శనివారం సహచరుల నెట్ ప్రాక్టీస్ సెషన్‌ను తిలకిస్తున్న భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
*కోచ్ మాథ్యూ మాట్‌తో గేమ్ ప్లాన్‌ను చర్చిస్తున్న ఆసీస్ మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్