క్రీడాభూమి

జట్టులోకి హార్దిక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మాదాబాద్, మార్చి 8: స్వదేశంలో ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. తొలిసారి నూతన సెలక్షన్ కమిటీ చైర్మన్ సునీల్ జోషీ కమి టీ నేతృత్వంలో జట్టును ఆదివారం ప్రకటించారు. అయతే తుది జట్టులో ఇటీవల గా యం నుంచి కోలుకున్న రోహిత్ శర్మకు చోటు కల్పించలేదు. మరికొన్ని రోజులు విశ్రాంతి నిచ్చారు. అయతే మరో రెగ్యూలర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టుతో చేరనున్నారు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు చోటు కోల్పోగా, ధావన్ రాకతో మయాంక్ అగర్వాల్‌కు తుది జ ట్టులో చోటు దక్కలేదు. ఇటీవల డీవై పాటిల్ ట్రోఫీలో రాణించిన పాండ్యాకు తిరిగి జట్టుతో చేరడంతో భారత్‌కు మరింత బలం చేకూరనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వనే్డ ఈ నెల 12న ధర్మశాల వేదికగా జరగనుండగా, రెండోవది 15న లక్నో, చివరిదైన మూడోది 18న కోల్‌కతా వేదికగా జరగనుంది.
భారత జట్టు: శిఖర్ ధావనర్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.