క్రీడాభూమి

చెలరేగిన విశ్వరాజ్, అవీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మార్చి 9: రంజీట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఫైనల్‌లో బెంగాల్‌తో తలపడుతున్న సౌరాష్ట్ర జట్టు తొలిరోజు సోమవారం 5 వికెట్లు కోల్పోయ 206 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్టక్రు ఓపెనర్లు హర్విక్ దేశాయ, అవీ బారోత్ మొదటి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో హర్విక్ దేశాయ (38) షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరోవైపు విశ్వరాజ్ జడేజాతో కలిసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే అవీ బారోత్ (54) ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెను దిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే విశ్వరాజ్ జడేజా (54) కూడా అర్ధ సెంచరీ సాధించి ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షెల్డన్ జాక్సన్ (14), చేతన్ సకారియా (4) తక్కువ స్లోర్లకే వెనుదిరగ్గా, చతే శ్వర్ పుజారా (5) రిటైర్డ్‌హార్ట్‌గా క్రీజును వదిలాడు. అప్పటికే వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపివేశారు. అప్పటికీ సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయ 206 పరుగులు చేసింది. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాన్ పొరెల్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు..
సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్ స: హర్విక్ దేశాయ (సీ) అభిషేక్ రామన్ (బీ) షాబాజ్ అహ్మద్ 38, అవీ బారోత్ (సీ) సాహా (బీ) ఆకాశ్‌దీప్ 54, విశ్వరాజ్ జడేజా (బీ) ఆకాశ్‌దీప్ 54, అర్పిత్ వసవద (బ్యాటింగ్) 29, షెల్డన్ జాక్సన్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఇషాన్ పొరెల్ 14, చటేశ్వర్ పుజారా (రిటైర్డ్‌హార్ట్) 5, చేతన్ సకరియా (సీ) సాహా (బీ) ఆకాశ్‌దీప్ 4.
ఎక్స్‌ట్రాలు: 8 మొత్తం: 206 (80.5 ఓవర్లలో 5 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-82, 2-113, 3-163, 4-182, 5-206
ఇషాన్ పొరెల్ 16-5-37-1, ముఖేష్ కుమార్ 22-3-55-0, షాబాజ్ అహ్మద్ 23-6-56-1, ఆకాశ్‌దీప్ 14.5-3-41-3, అర్నాబ్ నంది 5-1-11-0.
*చిత్రం... విశ్వరాజ్ జడేజా (54)