క్రీడాభూమి

ముగ్గురు బౌలర్లు.. ముగ్గురు బ్యాటర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం అంతర్జాతీ య క్రికెట కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా బ్యాటిం గ్, బౌలింగ్ ర్యాంకులను సోమవారం ప్రకటిం చింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపె నర్ బేత్ మూనీ రెండు స్థానాలను మెరుగు పర్చుకొని 762 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలవగా, న్యూజిలాండ్ మాజీ కెప్టెణ్ సుజీ బేట్స్ 750 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానా న్ని పదిలం చేసుకుంది. టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ రెండు స్థానాలు దిగజారి 744 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ 742 పాయింట్లతో నాలు గో స్థానాన్ని పదిల పరుచుకుంది. ఇక ఆస్ట్రేలి యా స్టార్ బ్యాటర్ అలీస్సా హేలీ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 714 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలి యా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 712 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానం దిగజారి 6వ స్థానంతో సరిపెట్టుకోగా, టీమిండియా సీనియర్ బ్యాట ర్ స్మృతీ మంధాన సైతం ఒక స్థానం దిగజారి 694 రేటింగ్ పాయంట్లతో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. టీమిండియాకు చెందిన మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రీగ్స్ 643 రేటింగ్ పాయంట్లతో 9 స్థానంలో నిలవగా, వెస్టిండీస్ క్రికెటర్ స్టఫైన్ టేలర్ 661 రేటింగ్ పాయం ట్లతో 8వ స్థానాన్ని పదిలం చేసుకోగా, ఇంగ్లాం డ్ క్రికెటర్ నటాలీ సీవర్ 636 రేటింగ్ పాయం ట్లతో టాప్-10లో చోటు దక్కిం చుకుంది.
ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ (716), రాధా యాదవ్ (704), పూనమ్ యాదవ్ (698) రేటింగ్ పాయంట్లతో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలవ గా, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ సోఫీ ఎకిల్ స్టోన్ 779 రేటింగ్ పాయంట్లతో టాప్‌లో నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ షుట్ 763 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానాన్ని కాపాడుకుంది.
దక్షిణాఫ్రికా బౌలర్ షబ్నాం ఇస్మాయల్ 743 రేటింగ్ పాయంట్లతో మూ డు, న్యూజిలాండ్ బౌలర్ అమేలియా కేర్ 740 రేటింగ్ పాయంట్లతో నాలుగు, 728 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన జెస్ జొనాసెన్ ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ ఎలీస్సె పెర్రీ (674), న్యూ జిలాండ్ బౌలర్ లీగ్ కాస్పర్క్ 670 రేటింగ్ పాయంట్లతో టాప్10లో చోటు దక్కించు కున్నారు.
*చిత్రాలు.. షెఫాలీ వర్మ

*స్మృతీ మంధాన