క్రీడాభూమి

అర్పిత్ సెంచరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మార్చి 10: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అర్పిత్ వాసవాద సెంచరీ సాధించాడు. దీనితో రెండో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 8 వికెట్లకు 384 పరుగులు చేయగలిగింది. ఐదు వికెట్లకు 206 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఈ జట్టుకు అర్పిత్ అండగా నిలిచాడు. 287 బంతులు ఎదుర్కొన్న అతను 11 ఫోర్లతో 106 పరుగులు చేసి, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. చటేశ్వర్ పుజారా 237 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి చిరాగ్ జానీ, ధర్మేంద్ర జడేజా చెరి 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 77 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్ చెరి రెండు వికెట్లు చొప్పున సాధించారు.