క్రీడాభూమి

ఇటలీలో టోర్నీలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మార్చి 10: ఇటలీలో అన్ని రకాల క్రీడా టోర్నమెంట్లు, సిరీస్‌లకు బ్రేక్ పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సిరీ ఏ’ ఫుట్‌బాల్ లీగ్‌సహా అన్ని రకాల క్రీడలను వచ్చేనెల మూడవ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు ఇటలీ ప్రధాన మంత్రి గిసెప్ కానే్ట ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడక ముందు ‘సిరీ ఏ’లో బ్రెస్కియాతో జరిగిన మ్యాచ్‌ని ససూలో 3-0 తేడాతో గెల్చుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన కొన్ని నిమిషాలకే ప్రధాని అత్యంత కీలకమైన ప్రకటన చేశాడు. కాగా, సాధ్యమైనంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అభిమానులకు ససూలో స్ట్రయికర్ ఫ్రానె్సస్కో కాపుటో సూచించాడు. ప్రధాని గిసెప్ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేశాడు. కరోనా వైరస్ వేగంగా వ్యప్తి చెందుతున్న నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల క్రీడా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హితవు పలికాడు. ఇటలీలో తాజాగా మరో 97 మృతి చెందడంతో, కరోనా వైరస్‌తో జరిపోయిన వారి సంఖ్య 463కు పెరిగింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు మూతపడ్డాయి. వివిధ క్రీడా పోటీలు లేదా టోర్నీలకు ఇటలీలో లక్షలాది మంది అభిమానులు హాజరవుతారు. ‘సిరీ ఏ’ వంటి సాకర్ టోర్నీల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. అందుకే, క్రీడా షెడ్యూల్‌ను ప్రధాని రద్దు చేశారు. ఏప్రిల్ మూడవ తేదీ తర్వాత రిషెడ్యూల్ చేస్తారో లేక మళ్లీ వాయిదా వేస్తారో తెలియని పరిస్థితి.