క్రీడాభూమి

కఠోర పరిశ్రమతోనే విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: కఠిర పరిశ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని భారత బాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో మహిళలు ఎంతో మంది క్రీడల్లో రాణిస్తున్నారని, భారీ సంఖ్యలో దేశానికి పతకాలు సాధించి పెడతారన్న నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పతకం వేటను కొనసాగించనున్న 24 ఏళ్ల సింధు బర్మింహామ్ నుంచి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళలంతా తమపై తాము నమ్మకాన్ని పెంచుకోవాలని పిలుపునిచింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయార్ అవార్డును స్వీకరించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, అంతకంటే ఎక్కువగా బాధ్యతను పెంచిందని ఇప్పటి వరకూ ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్స్ పతకాలను కైవసం చేసుకున్న సింధు వ్యాఖ్యానించింది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో పతకం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నది.
ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే..
ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకాలు సాధించి పెడతారని సింధు, సైనా నెహ్వాల్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. సింధు ప్రపంచ చాంపియన్‌కాగా, సైనా ఇది వరకు ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి అన్ని దేశాల్లోనూ ఆందోళన కలిగిస్తుండగా, బ్రిటన్ అధికారులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయించడం విశేషం. యూకేలోనే మూడు వందలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందారు. దీనితో పలు క్రీడా టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడ్డాయి. కానీ, ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ అధికారులు షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇలావుంటే, ఈసారి మహిళల విభాగంలోనే భారత అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇదే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కూడా జరగనున్న నేపథ్యంలో వీరిద్దరూ ఆల్ ఇంగ్లాండ్‌ను ప్రాక్టీస్ ఈవెంట్‌గా తీసుకొని శ్రమిస్తారని ధీమాతో ఉన్నారు. 1,10,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 12,000 ర్యాంకింగ్ పాయింట్లు కూడా బాడ్మింటన్ ప్లేయర్లను ఈ టోర్నీని సవాలుగా తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. సింధు ఒలింపిక్స్‌కు క్వాలిఫైకాగా, వచ్చేనెల 28వ తేదీలోగా సైనా, కిడాంబి శ్రీకాంత్ సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లను సంపాదించాలి. దీనితో వీరిద్దరూ ఆల్ ఇంగ్లాండ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత్‌కు మొట్టమొదటిసారి ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో ప్రకాశ్ నాథ్ పతకాన్ని అందించాడు. 1947లో అతను రన్నరప్‌గా నిలిచాడు. 1980లో ప్రకాశ్ పదుకొనే తొలిసారి భారత్‌కు టైటిల్‌ను అందించాడు. మరుసటి సంవత్సరం కూడా అతను ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించలేక, రన్నరప్ ట్రోఫీకే పరిమితమయ్యాడు. 2001లో తెలుగు వీరుడు పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. భారత్ తరఫున ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

*చిత్రం... బాడ్మింటన్ స్టార్ సింధు