క్రీడాభూమి

యథావిధిగా ఒలింపిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మార్చి 12: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా టోక్యో ఒలింపిక్స్ 2020 యథావిధిగా నిర్వహిస్తామని టోక్యో గవర్నర్ యురికో కొయ్యె స్పష్టం చేశారు. కరోనాతో జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు అక్కడ జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ అనుమానంగా మారిన పరిస్థితుల్లో తాజాగా టోక్యో గవర్నర్ ఈ విషయా న్ని వెల్లడించారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశాడు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక టోర్నీలు రద్దు కాగా, మరికొన్నిం టిని వాయదా వేసిన విషయం తెలిసిందే. ఒకవేళ టోర్నీలు నిర్వహించినా వాటికి అభిమానులెవ్వరినీ అనుమతించట్లే దు. ఇదిలాఉండగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించాలని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పష్టం చేసింది. కరోనా నివారణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఒలింపిక్స్ నిర్వహణకు తాము పూర్తిగా సహకరిస్తామని, కరోనా వ్యాప్తిని అడ్డుకు నేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

*చిత్రం... టోక్యో గవర్నర్ యురికో కొయ్యె