క్రీడాభూమి

వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆటగాళ్ల ప్రాక్టీస్ అనంతరం కుండపోతగా వర్షం రావడంతో సిబ్బంది మైదానమంతా కవర్లను కప్పి ఉంచారు. కొద్దిసేపటికే వర్షం తగ్గగా, అంపైర్లు మైదానాన్ని పరిశీలించేలోగా మళ్లీ వర్షం జోరందుకుంది. ఇలా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ గత న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ నెగ్గినా, టెస్టులు, వనే్డల్లో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.
మరోవైపు దక్షిణాఫ్రికా సైతం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వనే్డ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.