క్రీడాభూమి

ఇద్దరు సాకర్ ఆటగాళ్లకు సోకిన ‘మహమ్మారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్: ఫ్లొరెంటినా ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు మహమ్మారి కరోనా వైరస్ సోకింది. వీరిద్దరికీ జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇటలీ ఫార్వర్డ్ ఆటగాడు పాట్రిక్ కట్రోన్, అర్జెంటీనాకు చెందిన డిఫెండర్ జెర్మాయిన్ పెజెల్లాకు కరోనా వైరస్ సోకిందని జట్టు ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా క్లబ్ ఫిజియోథెరపిస్టు కూడా కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్టు తెలిపింది. కాగా, సెర్బియా ఫార్వర్డ్ దుసాన్ వ్లాహోవిక్‌కు కరోనా ఉన్నట్టు శుక్రవారం రాత్రి వెల్లడైంది. సాంప్‌డోరియాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లతోపాటు జువెంటాస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు డానియేల్ రుగానీ సైతం కరోనాతో చికిత్స పొందుతున్నాడు. సిరీ ‘ఏ’ సాకర్ టోర్నీని ఇటలీ ఫుట్‌బాల్ అధికారులు నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.