క్రీడాభూమి

ఎక్సెల్సెన్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, మార్చి 15: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చౌ తియేన్ చెన్‌కు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎదురుదెబ్బ తగిలింది. హాట్ ఫేవరిట్, రెండో ర్యాంక్ ఆటగాడు విక్టర్ ఎక్సెల్సెన్ టైటిల్ పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. టైటిల్ అందుకున్నాడు. డెన్మార్క్‌కు చెందిన 26 ఏళ్ల ఎక్సెల్సెన్‌కు కెరీర్‌లో ఇది 355వ విజయం. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఎక్సెల్సెన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ (2017), కాంస్య (2014) పతకాలను గెల్చుకున్నాడు. సుధీర్మన్ కప్ టోర్నీలో ఒకసారి కాంస్యాన్ని అందుకున్నాడు. ప్రఖ్యాత థామస్ కప్ టోర్నీలో ఒకసారి స్వర్ణం, రెండు పర్యాయాలు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లో అతను రెండు స్వర్ణం, మూడు కాంస్య పతకాలను సాధించాడు. అంతకు ముందు జూనియర్స్ విభాగంలో వివిధ టోర్నీల్లో పోటీపడిన అతను నాలుగు స్వర్ణం, ఒక రజతం, మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
బాడ్మింటన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ గెల్చుకోవాలని కోరుకునే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో అతని విజృంభణకు తియెన్ చెన్ నుంచి ఏ దశలోనూ చెప్పుకోదగిన ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇలావుంటే, కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఖాళీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో యుకీ ఫకుషిమా, సయాకా హిరోతా జోడీకి టైటిల్ దక్కింది. వీరు ఫైనల్లో డూ వయే, లీ ఇన్ హుయ్ జోడీపై 21-13, 21-15 తేడాతో గెలుపొందారు.