క్రీడాభూమి

కోల్‌కతాకు చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియాతో సిరీస్‌కు సందర్భంగా భారత్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు సోమవారం కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం క్రికెటర్లు ఇక్కడి నుంచే తిరిగి స్వదేశానికి బయల్దేరనున్నారు. అయతే కరోనా వైరస్ కారణంగా టీమిండియాతో జరగాల్సిన సిరీస్ రద్దయన విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి 18 వరకు మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇరు జట్లు తలపడాల్సి ఉండగా, ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షంతో టాస్ వేయకుండానే రద్దు కాగా, మిగతా రెండు మ్యాచ్‌లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు రద్దు చేశారు. అయతే క్రికెటర్లు ఢిల్లీ నుంచే స్వదేశానికి వెళ్లాల్సి ఉండగా, కరోనా భయంతో లక్నోలోనే గడిపారు. చివరికి కరోనా ప్రభావం లేని రాష్ట్రం నుంచి స్వదేశానికి వెళ్తామని దక్షిణాఫ్రికా క్రికెటర్లు బీసీసీఐని కోరడంతో చివరికి కోల్‌కతా నుంచి వెళ్లేందుకు అన్ని రకాలుగా సహకరించినట్లు, ఇందుకు అక్కడి ప్రభుత్వం సహకారంతో అన్ని క్రికెటర్లు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా పేర్కొన్నాడు.