క్రీడాభూమి

బెంగాల్ క్రికెట్ సంఘంలోనూ ‘వర్క్ ఫ్రం హోమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 17: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) అధికారులు కూడా సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించారు. చాలా వరకు ఐటీ కంపెనీలు, ఇతర బహుళజాతి సంస్థలు, పలు కార్పొరేట్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ వెసులు బాటును కల్పించారు. అదే తరహాలో కార్యాలయాన్ని ఐదు రోజులు మూసి ఉంచుతున్నామని, సిబ్బంది ఇంటి నుంచే విధులను నిర్వహించవచ్చని కాబ్ కార్యదర్శి దేవవ్రత దాస్ తెలిపాడు. మంగళవారం మూడపడిన కార్యాలయం ఆదివారం సెలవు తర్వాత, సోమవారం తెరచుకుంటుందని ఆయన అన్నాడు. అయితే, ఏవైనా అత్యవసర పనులు పడితే సిబ్బంది కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, వివిధ టోర్నీలు, పోటీలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాబ్ కూడా పలు మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేసింది.