క్రీడాభూమి

బయెర్న్, డార్ట్‌మండ్ ట్రైనింగ్ సెషన్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లింగ్, మార్చి 17: కరోనా వైరస్ కారణంగా వివిధ క్రీడా టోర్నీలు, సిరీస్‌లు మాత్రమేగాక, ట్రైనింగ్ సెషన్లు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా బయెర్న్ మ్యూనిచ్, డార్ట్‌మండ్ ఫుట్‌బాల్ జట్లు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేశాయి. డార్ట్‌మండ్ తన ఆటగాళ్లకు ఓ వారం విశ్రాంతి ప్రకటించింది. తమతమ ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించింది. బయెర్న్ కూడా కనీసం వారం రోజులు ప్రాక్టీస్ సెషన్‌కు ఆటగాళ్లను దూరంగా ఉంచడం ఖాయంగా కనిపిస్తున్నది. డార్ట్‌మండ్ కోచ్ లూసియన్ ఫెర్నె, బయెర్న్ కోచ్ హాన్సీ ఫ్లిక్ కూడా తమతమ ఆటగాళ్ల ఆరోగ్యమే తమకు ప్రధానమని, ప్రాక్టీస్ సెషన్స్‌కు తప్పక హాజరుకావాలంటూ ఎవరినీ పట్టుబట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు ఫ్రాధాన్యం ఇస్తున్నందుకే, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వారిని ట్రైనింగ్ లేదా మ్యాచ్‌ల పేరుతో ఇరుకున పెట్టదలచుకోలేదని ఇద్దరూ వేరువేరు ప్రకటనల్లో స్పష్టం చేశారు.