క్రీడాభూమి

జపాన్ ఒలింపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్ తషిమాకు కరోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: జపాన్ ఒలిపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్ కొజో తషిమాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తషిమాకు వైరస్ సోకిందన్న వార్తతో యావత్ క్రీడారంగం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏకంగా ఒలింపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్‌కే కరోనా వైరస్ సోకితే, ఈ మెగా టోర్నీలో పాల్గొనే వేలాది మంది అథ్లెట్లు, ఇతరత్రా సిబ్బందికి, లక్షలాదిగా తరలి వచ్చే ప్రేక్షకులు, క్రీడాభిమానులకు సరైన ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు జరుగుతాయా అని పలువురు ప్రశ్నిస్తున్నరు. ‘నాకు స్వల్పంగా జ్వరం వచ్చింది. వైద్య పరీక్షల్లో నాకు న్యుమోనియా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని నేను దాచుకో దలచుకోలేదు. వైద్య నిపుణుల మార్గదర్శకంలో మందులు వాడుతున్నాను’ అన్నాడు. గత నెల 28 నుంచి తాను వ్యాపార పర్యటనలో ఉన్నానని, అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎఫ్‌ఏబీ) వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యానని చెప్పాడు. తషిమా టోక్యో ఒలింపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్‌గానేగా, జపాన్ ఫుట్‌బాల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తున్నాడు. ఈనెల 2వ తేదీన ఆమ్‌స్టర్‌డామ్‌లోని యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్‌ఏ) సమావేశానికి హాజరైన అతను, 2023లో మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించేందుకు వీలుగా బిడ్ కూడా వేశాడు. కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రజలు ఇంకా కరచానాలు ఇవ్వడం, హగ్ చేసుకోవడం మానలేదని తషిమా అన్నాడు. మహిళల ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ను నిర్వహించే అవకాశం తమకు లభించేందుకు అవసరమైన లాబీయింగ్ చేసేందుకు జపాన్ మహిళా ఫుట్‌బాల్ సంఘం అధికారులు అమెరికాలో ఉన్నారు. ఈనెల 8న తషిమా వారిని కలిశాడు. అమెరికాలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నదని అన్నాడు. అయితే తనకు కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడు సోకి ఉండవచ్చనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదని అన్నాడు.