క్రీడాభూమి

ఏకాంతంలో క్రికెటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, మార్చి 18: దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమంతట తామే స్వచ్ఛందంగా ఏకాంతంలోకి వెళ్లిపోయారు. భారత పర్యటన కరోనా వైరస్ కారణంగా అర్ధంతంగా నిలిచిపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చిన దక్షిణాఫ్రికా జాతీయ జట్టు క్రికెటర్లంతా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. భారత్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. లక్నోలో రెండో వనే్డ, కోల్‌కతాలో చివరిదైన మూడో వనే్డ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తొలుత నిర్ణయించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ రెండు మ్యాచ్‌లను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెండు వారాలపాటు వారు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఒకవేళ కరోనా వైరస్ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వారు వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన ఇతర ప్రయాణికుల మాదిరిగానే దక్షిణాఫ్రికా ప్రభుత్వం క్రికెటర్ల కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. క్రికెటర్లు తమను తాము రక్షించుకుంటూనే చుట్టుపక్కల వాళ్లకు కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని దక్షిణాఫ్రికా అధికారులు స్పష్టం చేశారు.