క్రీడాభూమి

కౌంటీలపై అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 18: అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో అనిశ్చిత వాతావరణం కొనసాగుతున్నది. కరోనా వైరస్ యూరోప్‌ను కూడా భయాందోళనకు గురిచేస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు (ఈడబ్ల్యూసీ) అన్ని రకాల పోటీలను నిరవధికంగా వాయిదా వేసింది. ఇంగ్లీష్ కౌంటీలు కూడా వాయిదా పడ్డాయి. సహజంగా ప్రతి ఏడాది ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంటుంది. కౌంటీ మ్యాచ్‌లతో స్టేడియాలు హోరెత్తిపోతుంటాయి. క్రికెట్ అభిమానులు వేలాదిగా హాజరై ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తుంటారు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎక్కడా మ్యాచ్‌లు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న కొన్ని మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్న రీతిలో ఈ మ్యాచ్‌లు ముగుస్తున్నాయి. ప్రేక్షకులు లేని కారణంగా స్టేడియాలు బోసిపోతున్నాయి. కాగా, ఇలాంటి పరిస్థితిని తానెప్పుడూ ఊహించలేదని, కౌంటీ మ్యాచ్‌లు లేని సీజన్ మొట్టమొదటిసారిగా చూస్తున్నానని ఎసెక్స్ క్లబ్ ఫాస్ట్ బౌలర్ శాం కుక్ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతున్నదో, ఏం జరుగబోతున్నదో కూడా ఎవరికీ తెలియడం లేదని అన్నాడు. అయితే, తాము మాత్రం మ్యాచ్‌లు ఎప్పుడు మొదలైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటామని అన్నాడు. కాగా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించి, కొన్ని టోర్నీలను లేదా మ్యాచ్‌లను జరిపించాలన్న వాదన వినిపిస్తున్నది. వెస్టిండీస్‌తో జూన్‌లో జరగాల్సిన టెస్ట్ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఇప్పటినుంచే స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సరైన షెడ్యూల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని క్రీడాభిమానులు అభిప్రాయడుతున్నారు.