క్రీడాభూమి

డబ్బే ప్రధానమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: క్రీడాకారుల ఆరోగ్య భద్రత కంటే డబ్బే ప్రధానమా అంటూ ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారులపై భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ విరుచుకుపడింది. ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయకుండా కొనసాగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ప్రపంచంలోని పలు ప్రాంతాలతోపాటు యూకేలోనూ వ్యాపించిన విషయాన్ని ఆమె తన ట్విట్టర్ మాధ్యమంగా ప్రస్తావించింది. పరిస్థితి భయానంగా ఉన్నప్పటికీ కేవలం డబ్బు కోసమే బీడబ్ల్యూఎఫ్ అధికారులు ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్‌ను వాయిదా వేయకుండా, షెడ్యూల్ ప్రకారమే నిర్వహించారని ఆమె వ్యాఖ్యానించింది. క్రీడాకారుల ఆరోగ్యాన్ని బీడబ్ల్యూఎఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ 30 ఏళ్ల క్రీడాకారిణి వ్యాఖ్యానించింది. అన్ని క్రీడా సమాఖ్యలు, సంఘాలు వివిధ రకాల టోర్నీలు, సిరీస్‌లను రద్దు చేసినప్పటికీ బీడబ్ల్యూఎఫ్ మాత్రం షెడ్యూ ల్ ప్రకారం యథాతథంగా కొనసాగించడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.