క్రీడాభూమి

అదే దారిలో యూఎస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ఫ్రెంచ్ ఓపెన్ మాదిరిగానే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 13వరకు యూఎస్ ఓపెన్‌ను ఫ్లషింగ్ మెడోస్ కేంద్రంలోని బిల్లీ జీన్ కింగ్ కోర్టులో నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీని వాయిదా వేసే ఆలోచనలో యూఎస్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) ఉందని సమాచారం. మే 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4వ తేదీవరకు నిర్వహించాలని ఫ్రాన్స్ టెన్నిస్ సమాఖ్య తీసుకున్న నిర్ణయం కూడా యూఎస్‌టీఏ తన షెడ్యూల్‌ను మార్చుకునే సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టేలా ఒత్తిడికి గురిచేస్తున్నది. షెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ జరిగితే, ఆ తర్వాత వారం రోజులకే ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా యూఎస్ ఓపెన్‌ను కూడా వాయిదా వేస్తారని సమాచారం.