క్రీడాభూమి

ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: కరోనా వైరస్ తీవ్రత రోజురోజు కూ పెరుగుతున్న నేపథ్యంలో, టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిదని భారత బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్‌ను జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వ రకూ నిర్వహించాల్సి ఉంటుంది. అయతే, ప్రపంచ వ్యాప్తం గా 80కి పైగా దేశాల్లో కరోనా వైరస్ సమస్య ఉన్నందున ఒ లింపిక్స్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని పరిశీలకు లు అభిప్రాయపడుతున్నారు. కానీ, అంతర్జాతీయ ఒలింపి క్ మండలి (ఐఓసీ) అధికారులు ఇంత వరకూ ఈ విషయం లో ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేగాక, గురువారం ఒలింపిక్ క్రీడా జ్యోతి రిలే అధికారికంగా ప్రారంభమైంది. భారత మహిళా హాకీ జట్టుకు శిక్షణా శిబిరాన్ని యథాతథం గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయ. కాగా, ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని గోపీచంద్ సూచించాడు. షెడ్యూల్ ప్రకారమే ఒ లింపిక్స్‌ను నిర్వహించాలని ఐఓసీ పట్టుదలతో ఉందనే వా ర్తను ఆయన ప్రస్తావిస్తూ, తనకు మాత్రం ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. ఒలింపిక్స్ వంటి మే జర్ టోర్నీ సమీపిస్తున్న సమయంలో, దానికి సంబంధించి న పనులన్నీ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉందని అన్నా డు. కానీ, ఇంత వరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లే దని చెప్పాడు. ఈ తరుణంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తు న్నట్టు ఐఓసీ ప్రకటిస్తే, అందరూ ఊపిరి పీల్చుకుంటారని వ్యాఖ్యానించాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ప్ర యాణాలపై ఆంక్షలు విధించాయని అన్నాడు. విదేశాలకు వె ళ్లడంపై ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, కాబట్టి ప్రపంచ దే శాల నుంచి ఒలింపిక్స్‌కు అథ్లెట్లు హాజరు కావడం కష్టసా ధ్యమని చెప్పాడు. ఐరోపాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ గా ఉన్నప్పటికీ, ఇటీవలే ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపి యన్‌షిప్‌ను నిర్వహించడాన్ని స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వా ల్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. దీనిపై గోపీచంద్ వ్యా ఖ్యానించకపోయినప్పటికీ, క్రీడాకారుల ఆరోగ్యానికి ప్రా ధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. అందుకే ఒలిం పిక్స్‌ను వాయిదా వేయాలని కోరుతున్నానని చెప్పాడు.