క్రీడాభూమి

చండీలా, హికేన్‌లకు 24న శిక్ష ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ నేరాలను ఎదుర్కొన్న అజిత్ చండీలా, హికేన్ షాలకు విధించాల్సిన శిక్షణను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల 24న ఖరారు చేయనుంది. 2013లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన చండీలాతోపాటు అతని సహచరులు అంకిత్ చవాన్, శ్రీశాంత్‌లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా ముంబయి రంజీ ఆటగాడు హికేన్ షాపై కూడా బుకీలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరపణలు రావడంతో, అతనికీ బిసిసిఐ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ శిక్షను ఖాయం చేస్తుంది. ఐపిఎల్ ఆటగాళ్లలో కొంత మందిని బుకీలకు హికేన్ పరిచయం చేశాడన్న ఆరోపణలున్నాయి. బిసిసిఐ ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం రుజువైంది. దీనితో అతనిపైన కూడా బోర్డు చర్యకు ఉపక్రమించింది. తాము ఎలాంటి నేరానికి పాల్పడ లేదని వీరిద్దరూ వాదించారు.