క్రీడాభూమి

నేటి నుంచి ‘పింక్‌బాల్’ క్రికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 17: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సూపర్‌లీగ్ ఫైనల్‌లో భాగంగా మోహన్ బగాన్ జట్టు, భవానీపూర్ క్లబ్ జట్ల మధ్య శనివారం ఇక్కడ ప్రారంభమయ్యే నాలుగు రోజుల మ్యాచ్ దేశంలోనే తొలిసారిగా పింక్‌బాల్‌తో జరిగే తొలి డే/నైట్ మ్యాచ్ కాబోతోంది. టీమిండియా తరఫున గతంలో ఆడిన మహమ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహాలు తొలిసారిగా ఈ తరహా క్రికెట్ అనుభవాన్ని చవి చూడబోతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆలోచనల ఫలితంగా ఈ సూపర్‌లీగ్ ఫైనల్‌ను తొలిసారిగా డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహించబోతున్నారు. ఉపఖండం పరిస్థితుల్లో ఫ్లడ్‌లైట్ల మధ్య పింక్ కోకాబురా బంతి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసువడానికి ఇదో మంచి అవకాశం కాబోతోంది. ఒక వేళ ఈ ప్రయోగం కనుక విజయవంతమయితే గంగూలీ నేతృత్వంలోని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బిసిసిఐ నిర్వహించాలనుకుంటున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో తొలిసారిగా డే/నైట్ టెస్టుమ్యాచ్‌ని నిర్వహించాలని బిసిసిఐ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా జట్టులో స్థానం పొందే అవకాశమున్న మహమ్మద్ షమీ మోహన్ బగాన్ తరఫున ఆడుతుండడంతో అతనికి ఇది తొలి అనుభవం కానుంది. మరోవైపు వృద్ధిమాన్ సాహాకు పింక్ బాల్స్‌తో ఆడిన అనుభవం ఏడేళ్ల క్రితమే ఉంది. గతంలో 2009-10లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎ-లిస్ట్ మ్యాచ్ సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పింక్, గ్రీన్ బంతులను ఉపయోగించారు.కాగా, ఈ సీజన్‌లో దులీప్ ట్రోఫీ జోనల్ మ్యాచ్‌లను డే/నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించాలని గంగూలీ నేతృత్వంలోని బిసిసిఐ టెక్నికల్ కమిటీ ఇదివరకే సిఫార్సు
చేసింది.