క్రీడాభూమి

కోపా అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్ చేరిన అర్జెంటీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, (అమెరికా), జూన్ 22: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికాతో జరిగిన సెమీ ఫైనల్‌ను ఈ జట్టు 4-0 తేడాతో గెల్చుకుంది. అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహిస్తూ కెరీర్‌లో 55వ గోల్‌ను నమోదు చేసిన సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధికంగా 54 గోల్స్ సాధించిన గాబ్రియెల్ బటిస్టా రికార్డును అతను బద్దలు చేశాడు. ఈ టోర్నీలో నాలుగో గోల్ చేసిన మెస్సీకి అర్జెంటీనా తరఫున ఇది 112వ మ్యాచ్. 1991-2002 మధ్యకాలంలో ఆడిన బటిస్టా 77 మ్యాచ్‌లు ఆడి 54 గోల్స్ చేశాడు. ఆ రికార్డును మెస్సీ అధిగమించాడు. బటిస్టా రెండో స్థానానికి పడిపోగా, హెన్మన్ క్రెస్పో (35 గోల్స్), డిగో మారడోనా (34 గోల్స్) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
అమెరికా, అర్జెంటీనా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుందనుకున్న కోపా అమెరికా సెమీ ఫైనల్ ఏక పక్షంగా ముగిసింది. అర్జెంటీనా విజృంభణకు అమెరికా ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మ్యాచ్ మూడో నిమిషంలోనే ఎజెక్విల్ లావెజీ అర్జెంటీనాకు తొలి గోల్‌ను అందించాడు. ఆ గోల్ లభించిన వెంటనే దూకుడును పెంచిన అర్జెంటీనాను కట్టడి చేయడానికి అమెరికా రక్షణ విభాగం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 32వ నిమిషంలో మెస్సీ రికార్డు గోల్ సాధించి, తన జట్టుకు 2-0 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. మ్యాచ్ ద్వితీయార్ధంలోనూ అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగింది. 50వ నిమిషంలో గంజాలో హుగుయిన్ చక్కటి గోల్ చేశాడు. తిరిగి అతను 80వ నిమిషంలో మరో గోల్ సాధించి, అమెరికాపై అర్జెంటీనా 4-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.