క్రీడాభూమి

ప్లంకెట్ సూపర్ సిక్స్ శ్రీలంక, ఇంగ్లాండ్ తొలి వనే్డ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, జూన్ 22: టెయిలెండర్ లియామ్ ప్లంకెట్ చివరి బంతిని సిక్స్‌గా మార్చడంతో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ టైగా ముగిసింది. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒకానొక దశలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 82 పరుగులకు చేరుకునే సమయానికి మొత్తం ఆరు వికెట్లు కూలాయి. అయితే క్రిస్ వోక్స్, జొస్ బట్లర్, ప్లంకెట్ అర్ధ శతకాలతో రాణించి ఇంగ్లాండ్ విజయావకాశాలకు ఊపిరినిచ్చారు. నువాన్ ప్రదీప్ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు అవసరంకాగా, మొదటి ఐదు బంతుల్లో ఇంగ్లాండ్‌కు ఏడు పరుగులు లభించాయి. దీనితో చివరి బంతికి సిక్స్ కొడితే తప్ప ఓటమి నుంచి బయటపడలేని పరిస్థితిలో ఇంగ్లాండ్ చిక్కుకుంది. ఎవరూ ఊహించని విధంగా ప్లంకెట్ చివరి బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్ కొట్టి ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి కాపాడి, మ్యాచ్‌ని టైగా ముగించాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (73), సికూగె ప్రసన్న (59) అర్ధ శతకాలను సాధించగా, చివరిలో పర్వీజ్ మహారుఫ్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరి ప్రతిభ వల్ల శ్రీలంకకు ఆ స్కోరు సాధ్యమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, లియామ్ ప్లంకెట్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
శ్రీలంకను ఓడించేందుకు 287 పరుగులు సాధించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేయగలిగింది. జొస్ బట్లర్ 99 బంతుల్లో 93, క్రిస్ వోక్స్ 92 బంతుల్లో 95, ఇయాన్ మోర్గాన్ 49 బంతుల్లో 43 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను గెలిపించేందుకు చెమటోడ్చారు. వారి ప్రయత్నంతో, ఇంగ్లాండ్ చివరి ఓవర్‌లో విజయానికి 14 పరుగుల దూరంలో నిలిచింది. నువాన్ ప్రదీప్ యార్కర్లు, గుడ్‌లెంగ్త్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా, ప్లంకెట్ చివరి బంతిని భారీ సిక్స్‌గా మార్చడంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ టైగా ముగిసింది.

పాత్రికేయుడిపై రొనాల్డో ఆగ్రహం

మైక్రోఫోన్‌ను చెరువులోకి విసిరేసిన ఫుట్‌బాల్ స్టార్
లియాన్, జూన్ 22: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం వచ్చింది. యూరో 2016 చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో తనకు లభించిన పెనాల్టీ షూట్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయిన రొనాల్డోపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆస్ట్రియాతో పోర్చుగల్ మ్యాచ్‌ని డ్రా చేసుకోవాల్సి వచ్చింది. కాగా, హంగరీతో మ్యాచ్‌కి ముందు రొనాల్డోను ఇంటర్వ్యూ చేసేందుకు పోర్చుగల్ వార్తాపత్రి కొరియో డ మన్హాలో పని చేస్తున్న ఓ పాత్రికేయుడు ప్రయత్నించాడు. ‘మ్యాచ్‌కి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అంటూ మైక్రోఫోన్‌ను రొనాల్డో ముందు పెట్టి ప్రశ్నించాడు. అప్పటికే చాలా చిరాకుగా ఉన్న రొనాల్డో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మైక్రోఫోన్‌ను అతని చేతిలో నుంచి లాక్కొని పక్కనే ఉన్న చెరువులోకి విసిరేశాడు. అంతకు ముందు ఒకసారి తన వ్యక్తిగత జీవితంపై సచిత్ర కథనాలను ప్రచురించిన కొరియో డి మన్హాలోపై రొనాల్డో ఆగ్రహంతో ఉన్నాడు. ఆ కోపాన్ని అతను తనను ప్రశ్నించిన పాత్రికేయుడిపై చూపాడు.