క్రీడాభూమి

ఐర్లాండ్ ప్రతీకారేచ్ఛ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లియాన్, జూన్ 25: ఫ్రాన్స్ పేరు వింటేనే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అభిమానులు మండిపడుతున్నారు. 2009 నవంబర్ 18న జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు థియెరీ హెన్రీ రెండు పర్యాయాలు చేతిని అడ్డం పెట్టి బంతిని ఆపిన సంఘటనను వారు ఇప్పటికీ మరచిపోలేదు. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1 తేడాతో గెల్చుకుంది. నిజానికి హెన్రీ చేతిని అడ్డంపెట్టి రెండు గోల్స్‌ను ఆపడమే తమ జట్టు పరాజయానికి కారణమని ఐరిష్ అభిమానులు మండిపడుతున్నారు. ఆ మ్యాచ్ జరిగిన స్టేడ్ డి ఫ్రాన్స్‌లోనే యూరో 2016 ప్రీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్, ఐర్లాండ్ జట్ల మధ్య ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐరిష్ అభిమానుల్లో ప్రతీకారేచ్ఛ స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ మ్యాచ్‌లో తమ జట్టు గెలవాలని, ఫ్రెంచ్ అభిమానులను ఏడిపించే రీతిలో తాము వేడుకలు చేసుకోవాలని వీరు గంపెడాశతో ఉన్నారు. ఐరిష్ ఆటగాళ్లు కూడా ఇదే పట్టుదలతో ఉన్నారు. ఫ్రాన్స్‌ను పారిస్‌లోనే ఓడించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం మీద ఆదివారం జరిగే మ్యాచ్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్, ఐర్లాండ్ మ్యాచ్ ఫైనల్‌ను తలపించనుంది. మిగతా మ్యాచ్‌ల్లో, స్లొవేకియాతో జర్మనీ, హంగరీతో బెల్జియం జట్లు తలపడతాయి. ఇలావుంటే, నాకౌట్ మ్యాచ్‌లంటే తమకు ఎంతో ఇష్టమని జర్మనీ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ వ్యాఖ్యానించాడు. స్లొవేకియాతో యూరో 2016 ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ నాకౌట్ దశలో ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నాడు. ఒత్తిడిలో ఆడ డం తమకు లాభించే అంశమన్నాడు. తాము క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
హంగరీతో జాగ్రత్త: విల్మోట్స్
టౌలొస్: హంగరీతో జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని బెల్జియం కోచ్ మార్క్ విల్మోట్స్ తమ ఆటగాళ్లను హెచ్చరించారు. యూరో 2016 ప్రీ క్వార్టర్స్‌లో హంగరీని ఢీ కొంటున్న బెల్జియం విజయమే లక్ష్యంగా ఎంచుకుందని అన్నాడు. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశాడు. ఏ దశలోనూ హంగరీకి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా ఆడితేనే గెలుస్తామని అన్నాడు.