క్రీడాభూమి

రోనాల్డో-మెస్సీ శకానికి చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 25: దాదాపు దశాబ్ధ కాలంపాటు ఫుట్‌బాల్ క్రీడారంగంలో సాటిలేని ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీల శకానికి క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లూకా మోడ్రిక్ అడ్డుకట్ట వేశాడు. వ్యక్తిగత విభాగంలో ఎఫ్‌ఐఎప్‌ఏ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని మంగళవారం మోడ్రిక్ అందుకున్నాడు. క్రోయేషియాకు చెందిన మిడ్‌ఫీల్డర్ మోడ్రిక్ అటు క్లబ్, ఇటు దేశవాళీ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శలతో ఆకట్టుకున్నాడు. మేడ్రిడ్ జట్టు చాంపియన్స్ లీగ్‌ను కైవశం చేసుకోవడంలో ఆయన కీలక భూమిక పోషించాడు. అలాగే ప్రపంచకప్ పోటీల్లో క్రొయేషియా జట్టు ఫైనల్‌కు చేరడంలోనూ ఆయన అసమాన ప్రతిభను ప్రదర్శించాడు. తనను ప్రోత్సహించిన వారికి, అభిమానించి పురస్కారాలకు ఎంపిక చేసిన వారికి ఈ సందర్భంగా మోడ్రిక్ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే రోనాల్డోతోబాటు, మెస్సీ సైతం తన అవార్డు పురస్కార కార్యక్రమానికి హాజరుకాకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వారిద్దరూ తనకు ఆదర్శమని మోడ్రిక్ పేర్కొన్నాడు. వారిద్దరూ ఈ అవార్డులను ఐదేసిమార్లు అందుకున్న విషయాన్ని గుర్తుచేశాడు.ప్రపంచకప్‌లో డెన్మార్క్, రష్యాలతో జరిగిన మ్యాచ్‌ల్లో మోడ్రిక్ రెండుసార్లు కీలకమైన పెనాల్టీ షూట్ అవుట్‌లు చేసి ఆ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుగా బంగారు బాల్‌ను కైవసం చేసుకోవడం జరిగింది.