కృష్ణ

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ (ఐసిఇయు) ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి డివిజన్ కార్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసిఇయు అధ్యక్షులు జె సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అన్ని తరగతుల మహిళా ఉద్యోగులు, ఏజెంట్లు, కో-ఆపరేటివ్ బ్యాంక్ మహిళా సిబ్బంది, రిటైర్డ్ మహిళా ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ ఓ విజయశ్రీ, సంఘ సేవకురాలు కరెడ్ల సుశీల, ఎల్‌ఐసి సీనియర్ డివిజన్ మైనేజర్ సి బాలయ్య చౌదరి, మేనేజర్లు వై నాగేశ్వరమ్, రామనాథ్‌బాబు, సిహెచ్ సుబ్బరత్తమ్మ, ఎల్‌ఐసి మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ కో-కన్వీనర్ కెవి రమణకుమారి, ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి కిషోర్ సందేశాలిచ్చారు. ఈసందర్భంగా ఎల్‌ఐసి మహిళా ఏజెంట్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి టి చంద్రపాల్, ఎన్ సుబ్రహ్మణ్యం, ఆర్ సత్తార్ సాహెబ్, బి మధుర్, డి వాసు, ఎస్‌వి రత్నారావు, సుబ్రహ్మణ్యం, కెవి రమణకుమారి నాయకత్వం వహించారు. అనంతరం ఈడేపల్లి జెట్టి నరసింహ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బాబు ఎ