కృష్ణ

ఆధునిక సౌకర్యాలతో రైతుబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: రైతులు, వినియోగదారుల ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతులతో రైతుబజార్ నిర్వహించే విధంగా నమూనాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. స్థానిక గాంధీనగర్‌లోని అంలకార్ థియేటర్ సమీపంలోని రైవస్ కెనాల్ కట్టపై రైతుబజార్‌ను ఏర్పాటు చేసేందుకు శనివారం మధ్యాహ్నం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం క్యాంపు కార్యాలయం వద్ద సమీపంలో ఉన్న స్వరాజ్యమైదానం రైతుబజార్‌ను రైవస్ కాలువ వద్దకు తరలించటానికి నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. ఇందుకు రైవస్ కాలువపై ప్రస్తుతం అమేజాన్ అక్వేరియం నుండి విజయాటాకీస్ వంతెనకు రైతుబజార్‌ను నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. స్వరాజ్యమైదానం రైతుబజార్‌ను ప్రస్తుతం రైతులు, వికలాంగులు, డ్వాక్రా సంఘాలు మొత్తం కలిపి 325 స్టాల్స్ నిర్వహణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం బందరురోడ్డులో గల సబ్ కలెక్టర్ కార్యాలయం, విక్టోరియా మూజియం, లెనిన్ సెంటర్ వద్ద తరచుగా ధర్నాలు నిర్వహించటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు అలంకార్ థియేటర్ ఎదురుగావున్న రైవస్ కాలువ వద్ద ధర్నాను నిర్వహించటానికి అనుమతించటం జరిగిందని, ఇందుకు అనువుగా కెనాల్ బండ్ అనువుగా తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కెనాల్‌పై నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పనులను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని మరోచోట కేటాయించటం జరుగుతుందన్నారు. రైవస్ కాలువ నిర్మాణంలో ఉన్న ఇండోర్ సబ్ స్టేషన్‌ను సంబంధిత కట్టడాలను తొలగించాలని ఒకేసారి 10 వేల మంది ధర్నాలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలంకార్ వంతెన వైపు నుండి కొత్త వంతెన వరకు రైవస్ కాలువ బండ్‌ను సుందరీకరణ పనులు తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విఎంసి కమిషనర్ జి వీరపాండియన్, సబ్ కలెక్టర్ డా సృజన, డిసిసి కాళిదాసు, ఎసిపిలు రమేష్‌బాబు, తహశీల్దార్ శివరావు, మార్కెటింగ్ ఎడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో రెండు పూరిళ్లు దగ్ధం
గుడ్లవల్లేరు, మార్చి 26: మండల పరిధిలోని చింతలగుంట గ్రామంలో శనివారం తెల్లవారుఝామున ఒంటి గంటకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం పరిశే వీర వెంకట రామారావు, పరిశే నాగరాజు, పరిశే నరసింహారావు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో నిద్ర నుంచి తేరుకుని బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని సామగ్రి, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎంఆర్‌ఐ వై లక్ష్మీనారాయణ బాధిత కుటుంబాలకు పది కిలోల బియ్యం అందజేశారు. దాదాపు రూ.10లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఎంఆర్‌ఐ వివరించారు.