Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన చుట్టను పద్మమ్మే పద్మమ్మున రజము తాను
పదమో? పద్మమొ? తెలియని పదమున బలియుండెను.

వచనం: ఈ విధంగా తానే విశ్వం, విశ్వమే తానన్నట్లుగా, పెరిగి, పెరిగి, వటుడు ఒక విరాట్ స్వరూపుడై, వైశ్వానరుడై, ఊర్థ్వలోకాలనన్నిటిని అధిగమించాడు. మానవమాత్రుడు చూడలేనంత యెత్తుకెదిగాడు. ఆయన పాదమొక్కటే సూర్యప్రభలా విస్తరించి, భూమండలాన్నంతటినీ ఆక్రమించేసింది. అందువల్ల ఆయన మాట వినిపించడం తప్ప, ఆయన కనిపించడం లేదు. అలా, వారిరువురికీ హస్తిమశకాంతరం ఏర్పడింది. అప్పుడా రాజు సూర్యుని ముందు దివిటిలా వెలవెలబోయాడు.
ఆపై, ఆ పరమాత్మ ఆకసాన్ని ఆక్రమించడానికై తన రెండవ పాదాన్ని పైకెత్తసాగాడు. అప్పుడా అరుణ పాదమే ఒక ఆకసమైనట్లుగా బలి తలపై గొడుగైనట్లుగా, అమోఘంగా, అద్భుతంగా, వర్ణనాతీతంగా గోచరించసాగిందిలా:
పద్మమ్మే కాడతోడ పైపైకిని లేచెననగ
పైకి లేచె ప్రభువుపదము ఆకసమ్ము నంటుకొనగ

విస్తరించె విస్తరించె విస్తరిల్లె పదమప్పుడు
కనుచూపులు వెడలువరకు- కనులు ప్రయాణించు వరకు

పదమే పద్మమ్మాయెనొ? పద్మమ్మే పదమాయెనొ?
లోకములే పద్మమ్మున రేకులుగా మారెనో?

ఏమున్నది ఎటుచూచిన పద్మరాగ రాగమ్మే!
పడగమ్ముల దీవియాయె నీలి నీలి ఆకసమ్మె!

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087