తెలంగాణ

బిక్షగాళ్లను దోచుకున్న చరిత్ర డికె అరుణది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: బిక్షగాళ్లను కూడా దోచుకున్న చరిత్ర మీది అంటూ కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. డికె అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరడంపై అరుణ మండిపడ్డారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని, రాజకీయాల కోసం మా కుటుంబంలో టిఆర్‌ఎస్ చిచ్టు పెడుతోందని అరుణ టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. దీనిపై స్పందిస్తూ జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అడుక్కుతినే వారిని సైతం దోచుకున్న చరిత్ర డికె అరుణకు ఉందని, అవసరం అయితే అడుక్కు తింటాను కానీ టిఆర్‌ఎస్‌లో చేరను అంటున్నారని ఎద్దెవా చేశారు. గతంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిని సోనియాగాంధీ కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? అప్పుడు విలువలు ఏమయ్యాయని జూపల్లి ప్రశ్నించారు. తెలంగాణకు టిడిపి చేసిన ద్రోహాన్ని ప్రజలు మరిచిపోలేదని, అందుకే ఏ ఎన్నిక జరిగినా టిడిపికి డిపాజిట్లు దక్కడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే, విద్యార్థులు బలిదానాలు చేస్తుంటే, వచ్చేదా? చచ్చేదా? అంటూ పదవులు పట్టుకుని వేలాడిని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉనికి చాటుకునేందుకే అరుణ ఏమేమో మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో పిసిసి పదవి దక్కుతుందని ఆమె ఆశలు పెట్టుకున్నారని అన్నారు.

ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు.
బిక్షగాళ్లను సైతం దోచుకున్న కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. తరతరాలకు తరగని డబ్బు సంపాదించుకున్నారని అన్నారు. అధికారం, పదవులే పరమావధిగా కాంగ్రెస్ నాయకులు బతికారని విమర్శించారు.

ప్రతి పేదింటి బిడ్డకు ఇంగ్లీష్ చదువు
కడియం శ్రీహరి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15:ప్రతి పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం 250 గురుకులాలకు ముఖ్యమంత్రి అనుమతించారని తెలిపారు. ఈ గురుకులాల వల్ల అదనంగా లక్షా 60వేల మంది విద్యార్థులకు విద్యను అందించనున్నట్టు చెప్పారు. వీటి కోసం ఆరువేల మంది టీచింగ్ స్టాప్, నాలుగు వేల మంది నాన్ టీచింగ్ స్ట్ఫాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
దేశంలో మానవ వనరుల అభివృద్ధి సూచికలో మనం అట్టడుగున ఉన్నామని, ఇంకా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయినట్టు కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గమనించే తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చిందని, పేదవారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు.గురుకుల విద్యా విధానంలోనే డిగ్రీ కాలేజీలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. గురుకులాల కోసం 20 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. అందరికీ విద్యావకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. స్కూల్ డ్రాప్ ఔట్స్ విషయంలో, ఉన్నత విద్యా నమోదులో, మహిళా అక్షరాస్యతలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సూచికలో అట్టడుగు స్థానంలో ఉందని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని 36 రాష్ట్రాలు ఉంటే అక్షరాస్యత విషయంలో తెలంగాణ రాష్ట్రం 32వ స్థానంలో ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇది మనం సాధించిన ఘనత అని, ఈ పరిస్థితి మార్చడానికే ముఖ్యమంత్రి విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దళితుల అభ్యున్నతికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దళితులు అభినందిస్తుంటే విపక్షాలకు నచ్చడం లేదని అన్నారు. ప్రతిపక్షాలకు వచ్చిన సమస్య ఏమిటని నిలదీశారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా అందరూ దీన్ని అభినందించాలని అన్నారు.
అర్ధం లేని విమర్శలు: బాల్క సుమన్
దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో తమకు రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేస్తున్నాయని పార్లమెంటు సభ్యు లు బల్క సుమన్ విమర్శించారు. కడి యం శ్రీహరితో కలిసి తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని భయపడుతున్నారని, ప్రజలు మాత్రం కెసిఆర్ పథకాలకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

అన్ని గ్రామీణ మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి
సిఎంకు సిపిఐ లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణలో మొత్తం 434 గ్రామీణ రెవెన్యూ మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. యుద్ధప్రాతిపదికగా పంటల నష్టపరిహారాన్ని పరిశీలించి వరిపంటకు ఎకరాకు రూ.15వేలు చెల్లించాలన్నారు. అన్ని గ్రామాలకు ట్యాంకర్లు, బావుల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. వడదెబ్బతో చనిపోయినన వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు రూ.2000 కోట్లనిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల పంటరుణాలు రద్దు చేయాలన్నారు.
రామయ్య స్టడీసర్కిల్ ప్రవేశ పరీక్షకు 6500 మంది హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: చుక్కా రామయ్య ఐఐటి స్టడీసర్కిల్‌లో చేరేందుకు శుక్రవారం నాడు నిర్వహించిన ప్రవేశపరీక్షకు 6500 మంది హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఐదు కేంద్రాల్లో వీరంతా పరీక్ష రాశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చుక్కారామయ్య తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు పరీక్ష తీరుతెన్నులను పరిశీలించారు.
18నుంచి ఉజ్జయినికి ప్రత్యేక రైలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: సింహస్థ కుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉజ్జయిని వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18న కాజిపేట నుంచి ఈ రైలు సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. తర్వాత రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఉజ్జయి