తెలంగాణ

నత్తనడకన సాగర్ ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 27: నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కాలువల ఆధునీకరణ పనులు ఏడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ప్యాకేజీల వారిగా సాగుతున్న పనులకు తరుచు గడువు పొడగింపుతో పాటు కొత్త ఒప్పందాలతో ఖర్చు పెరుగిపోతున్నా పనులు మాత్రం సకాలంలో పూర్తి కావడం లేదు. 2016జూలై 15నాటికి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్న ప్రపంచ బ్యాంకు నిర్ధేశం దిశగా గత ఏడాది నుండి పనులు ముమ్మరం చేయాల్సిన గుత్తెదారులు, అధికారులు ఈ దిశగా నత్తనడకన సాగుతున్నారు. సాగర్ ఆధునీకరణ పనులు ప్రపంచ బ్యాంకు-ప్రభుత్వం ఉమ్మడి నిధులు 4,444.41కోట్లతో 2008లో ప్రారంభమయ్యాయి. నీటి విడుదల.. వర్షాలు వంటి సమస్యల నేపధ్యంలో కొందరు గుత్తెదారులకు ఒప్పంద గడువు, పని విలువలను పెంచారు. ఐనప్పటికి పలు ప్యాకేజీలలో పనులు గడువులోగా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ప్యాకేజీలు 1,3,4,6,8ల పనులు పెద్ద ఎత్తున అసంపూర్తిగా ఉన్నాయి. వర్షాలు సమృద్దిగా పడి కాలువలకు నీటి విడుదల చేసే ముందుగానే పనులను పూర్తి చేయాలంటు రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా పరిధిలోని 134 కిలోమీటర్ల సాగర్ ఎడమకాలువ ఆధునీకరణ పనులకు 300కోట్లు మంజూరు చేయగా ఇప్పటిదాకా ఐదు ప్యాకేజిల్లోని పనుల్లో 90శాతం పూర్తయినట్లుగా లెక్కలు చెబుతున్నారు. అలాగే అనుబంధ బ్రాంచ్ కెనాల్స్, మైనర్స్, మేజర్స్ కాల్వల ఆధునీకరణకు 182కోట్లు ఇవ్వగా అందులో 122కోట్ల పనులు చేశారు. హాలియా, వేములపల్లి, మిర్యాలగూడ, గరిడేపల్లి తదితర సాగర్ ఆయకట్టు మండలాల్లోని కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మిర్యాలగూడ సర్కిల్ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ 1నుండి 10వరకు, 16,17బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణకు 176.97కోట్లతో జరుగుతున్న పనుల్లో 123కోట్ల పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సాగుతున్న 41.50కోట్ల పనుల్లో 17కోట్ల పనులు జరిగాయి. 82నీటి సంఘాల పరిధిలో 203.69కోట్ల పనులను గుత్తెదారులకు అప్పగించగా 111.24కోట్ల పనులు జరిగాయి. ఎడమ కాలువ, అనుబంధ కాలువల్లో గుత్తెదార్లు ఎక్కువగా మట్టి పనులు ముందుగా పూర్తి చేసి కాల్వల లైనింగ్, సిమెంట్, కాంక్రిట్ రివిట్‌మెంట్, డిస్ట్రీబ్యూటరీలు, తూముల పనుల్లో జాప్యం చేస్తుండటం సమస్యగా మారింది. సాగర్ ఎడమకాలువ పరిధిలోని 41లిఫ్ట్ స్కీముల ఆధునీకరణపనులను 1 నుండి 4 ప్యాకేజీలుగా విభజించి 105.30 కోట్లతో చేపట్టగా 57.97కోట్ల పనులు మాత్రమే జరిగాయి.
సాగర్ ఆధునీకరణ పనుల్లో అధిక శాతం పూర్తయినా మిగిలిన అసంపూర్తి పనులను వర్షాలు వచ్చి కాలువలకు నీటి విడుదల జరిగేలోగా పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు ఒత్తిడి చేస్తున్నారు.

ప్యాకేజీ -3లో 68శాతం, ప్యాకేజి-8లో 18శాతం, ప్యాకేజి-4లో 80.54శాతం, ప్యాకేజీ-5లో 80శాతం, ప్యాకేజీ-7లో 90శాతం, ప్యాకేజి 9లో 80.74, ప్యాకేజీ-10లో 86.55శాతం పనులు జరిగాయి. ప్యాకేజి-1లో 78.77శాతం, ప్యాకేజి-2లో 93.54శాతం పనులు జరిగాయి.

పోటీ చేద్దామా? వద్దా?
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా? అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు. పోటీ చేయాలని కొందరు, గెలుపొందే సంఖ్య లేనప్పుడు పోటీ చేయడం ఎందుకని మరికొందరు వాదిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒపెన్ బ్యాలెట్ విధానం అమలులో ఉంది కాబట్టి పార్టీ ఫిరాయింపుదారులను మానసికంగా భయపెట్టేందుకు ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి ఫిరాయించింది 6 మంది ఎమ్మెల్యేలే. ఆ సంఖ్య కలిపినా 20 మందే అవుతున్నారు. మజ్లిస్ పార్టీ ఎటూ మద్దతు ఇవ్వదు. మిగతా ఒక్కోక్క ఎమ్మెల్యే ఉన్న సిపిఎం, సిపిఐల మద్దతు కూడగట్టినా 22 మందే అవుతారు. ఒకవేళ టిడిపి మద్ధతు ఇచ్చినా 25 మందే అవుతారు. కానీ గెలుపొందేందుకు 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం ఉంటుంది. కాబట్టి పోటీ చేయవద్దని మరి కొంత మంది గట్టిగా చెబుతున్నారు. పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై శనివారం చర్చించడంతో పాటు దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది పార్టీ అధిష్టానమే. శనివారం సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సిఎల్‌పి కార్యాలయంలో చర్చించనున్నట్లు సమాచారం.